Rashmika: విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన శ్రీవల్లి!
Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కేవలం దక్షిణ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు.ఈ సినిమా తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా కలిసి నటించడం వల్ల వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా నటి రష్మికకు విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు వచ్చాయి ఈ సందర్భంగా ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సాధారణంగా ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే ఈ విధమైనటువంటి రూమర్స్ రావడం సర్వసాధారణం. అలాంటి వాటి గురించి నేను అసలు పట్టించుకోను అంటూ సమాధానం చెప్పారు.
ఇక నిప్పులేనిదే పొగరాదు అంటారు కదా అని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఆ నిప్పు పెట్టింది మీరు అంటూ సమాధానం చెప్పారు. ఈమె పుష్ప సినిమాతో ఇంత మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక త్వరలోనే ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…