Featured

Chiranjeevi: సురేష్ బాబు పిలిచాడని చిరంజీవి సినిమాను వదిలేసా.. చివరికి అతడు హ్యాండ్ ఇచ్చాడు : డైరెక్టర్ చంద్రమహేష్

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చంద్ర మహేష్ ఒకరు. ఈయన గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర మహేష్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు. తాను గతంలో చిరంజీవితో సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకుంటూ ఉండగా సురేష్ ప్రొడక్షన్ నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు.

Chiranjeevi: సురేష్ బాబు పిలిచాడని చిరంజీవి సినిమాను వదిలేసా.. అతడు హ్యాండ్ ఇచ్చాడు!

సురేష్ ప్రొడక్షన్ తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిందని, ఆ ప్రొడక్షన్ లో పని చేయడం కోసం మెగాస్టార్ చిరంజీవికి ఇది పరిస్థితి అని చెప్పి చిరంజీవి సినిమా పక్కనపెట్టి రామానాయుడు గారి దగ్గరికి వెళ్లానని తెలిపారు. వెళ్లగానే నా చేతిలో కొన్ని సీడీలు పెట్టి ఈ సినిమాలన్నీ చూసి ఒక మంచి ఎమోషనల్ కథ ప్రిపేర్ చేయమని చెప్పారు. పోసాని గారితో కలిసి ఎన్ని కథలు సిద్ధం చేసిన ఫస్ట్ హాఫ్ నచ్చితే సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఇలా రెండు మూడు నెలల సమయం వృధా అయింది.

Chiranjeevi: సురేష్ బాబు పిలిచాడని చిరంజీవి సినిమాను వదిలేసా.. అతడు హ్యాండ్ ఇచ్చాడు!

కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా జయం మనదేరా సినిమా అనౌన్స్ చేశారు.ఒకవైపు చిరంజీవి గారి సినిమా పక్కన పెట్టి అక్కడికి వెళితే సురేష్ ప్రొడక్షన్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇక ఏం చేయాలో దిక్కుతోచక అందరి దగ్గరికి వెళ్లి అవకాశం అడిగితే కొంత సమయం వేచి ఉండమని చెప్పారు. అలాంటి సమయంలో శ్రీహరి ఒక్కడే సినిమా చేసే అవకాశం వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న తరువాత తనుకు రెమ్యూనరేషన్ కూడా పెరిగిందని, ఈ సినిమా తర్వాత తనకు మరోసారి రామానాయుడు గారి నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు.ఇలా రామానాయుడుగారు నన్ను కలవాలంటే వెళ్లి అతనిని కలిశానని నా చేతిలో ఐదు లక్షలు అడ్వాన్స్ పెట్టి చిరంజీవితో సినిమా చేయాలి అంటూ చెప్పినట్లు చంద్రమహేష్ వెల్లడించారు.

చిరంజీవితో సినిమా అవకాశం…

ఇదే విషయం చిరంజీవి దగ్గరికి వెళ్లి చెబితే నేనే నీ పేరు చెప్పాను అంటూ చిరంజీవి అన్నారు. అలా చిరంజీవి గారు నా పేరు చెప్పడంతో ఎంతో సంతోషించి ఆయనకు థాంక్స్ చెప్పి కథ సిద్ధం చేసే పనిలో పడ్డాను. అయితే రామానాయుడు గారికి నేను సిద్ధం చేస్తున్న కథకన్నా రచయిత చిన్ని కృష్ణ సిద్దం చేసిన కథ నచ్చింది.ఇక ఆ కథతో నేను డైరెక్ట్ చేయాలేమో అనుకున్నాను కానీ తీరా చూస్తే దర్శకుడిగా చిన్నకృష్ణ పనిచేస్తారని చెప్పారు. ఇలా మరోసారి కూడా మాకు సినిమా సెట్ అవ్వలేదని చంద్ర మహేష్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago