Featured

NTR : అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటివద్ద ఫాన్స్ హడావిడి.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు..

Fans celebrating NTR Birthday : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడిగా అభిమానులకు ఎంతో చేరువ అయ్యాడు ఎన్టీఆర్. వారసుడిగా వచ్చినా తనదైన నటన తో ఇండస్ట్రీ లో టాప్ హీరోగా వెలుగుతున్నాడు. తన నటన విశ్వరూపం తో తాతకు తగ్గ మనవడు అని పేరు తెచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన నటన, హావ భావాలతో అభిమానులను పెంచుకున్నాడు. ఇటీవలే కళాతపస్వి కె విశ్వనాధ్ గారు సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ నటనను ప్రశంసించారు. అయితే ఈరోజు ఎన్టీఆర్ 39 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు కావడం తో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఇంటిదగ్గరకు హంగామా చేశారు.

ఎన్టీఆర్ ఇంటివద్ద అర్ధరాత్రి అభిమానుల హడావుడి…..

టాలీవుడ్ లో టాప్ హీరో ల లో ఒకరైన ఎన్టీఆర్ నేడు 39వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం దగ్గర అర్ధరాత్రి అత్యుత్సాహం తో అభిమానులు అక్కడికి చేరుకొని హంగామా చేశారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ కు భారీగా జూనియర్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు కేక్ కట్ చేస్తూ గోల చేశారు. జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు, ఎన్టీఆర్ ను ఇక్కసారి ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. ఇంటి ముందే డ్యాన్సులు చేస్తూ నానా రచ్చ చేశారు.

అర్ధరాత్రి అభిమానులు అతుత్సాహం తో గూమికూడడం, వారి హంగామా, అల్లరి వలన అటువైపు వెళ్తున్న వాహనదారులు, స్థానికులకు ఇబ్బంది కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్టీఆర్‌ అభిమానులను అక్కడినుంచి పంపించేందుకు ప్రయత్నించారు. అయినా అభిమానులు వెళ్లకుండా, పోలీసుల మాటలను వినకపోవడంతో తప్పనిసరిగా అభిమానులపై లాఠీచార్జ్‌ చేశారు. అంతేకాకుండా కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. చివరకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడం వలన అభిమానులు ఎన్టీఆర్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago