Sanjana Galrani : నిక్కీ గిర్లాని, తమిళ నటుడు ఆది పినిశెట్టి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. తెలుగులో కూడా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వివాహం చెన్నైలో అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. తెలుగు హీరోలు నాని, సందీప్ కిషన్ లు వివాహానికి హాజరయ్యారు. ఇక నిక్కీ గిర్లాని అక్క సంజన కూడా హీరోయిన్ అని అందరికి తెలిసిందే.
మగబిడ్డకు జన్మనిచ్చిన సంజన….
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించింది. ఇక ఆ తరువాత సత్యమేవ జయతే, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించిన సరైన హిట్స్ లేవు. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంజన కెరీర్ ను మరింత డౌన్ కి తీసుకెళ్ళింది. మూడు నెలలు జైలు జీవితం గడిపిన ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బయటకు వచ్చాక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అజీజ్ భాష అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్న సంజన, అతని కోరిక మేరకు ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఇక గర్భవతిగా ఉన్న సంజన ఇటీవలే సీమంతం కూడా చేసుకుంది. కాగా తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఓవైపు అక్క బిడ్డకు జన్మ నివ్వడం, మరో వైపు చెల్లెలు పెళ్లి చేసుకోవడంతో అభిమానులకు డబల్ ట్రీట్ అయింది. పలువురు ఇద్దరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…