Sobhita: నాగచైతన్య నటి శోభిత నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడటం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెతో నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకుల కంటే ముందుగానే నాగచైతన్యకు శోభితతో మంచి పరిచయం ఉందట ఈ పరిచయం కారణంగానే సమంత నాగచైతన్యకు కూడా విడాకులు వచ్చాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోవడంతో అసలు వీరిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది అన్న ప్రశ్నలు కూడా అందరికీ తలెత్తుతూ ఉన్నాయి.
నాగచైతన్య శోభిత మద్య పరిచయం ఏర్పడటానికి ఒక హీరోయిన్ కారణమని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు స్వయంగా నాగార్జున మేనకోడలు నటి సుప్రియ యార్లగడ్డ అని సమాచారం. అడవి శేష్, శోభిత గూడచారి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో సుప్రియ కూడా నటించారు.అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ఈమె పలు సందర్భాలలో అక్కినేని ఇంటికి కూడా వచ్చారు అలా నాగచైతన్యతో కూడా తనకు పరిచయం ఏర్పడింది.
సుప్రియతో పరిచయమే కారణమా..
ఈ విధంగా శోభితతో నాగచైతన్యకు పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అయితే వీరి విడాకులకు ముందే ఆమెతో చాలా మంచి చనువు ఉండడంతోనే సమంత నాగచైతన్య మధ్య గొడవలు రావడం వారు విడాకులు తీసుకోవడం వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య పలు సందర్భాలలో శోభితతో కలిసి కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని స్పష్టంగా అర్థమైంది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ వీరిద్దరు నిశ్చితార్థం జరుపుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…