Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటమేకాకుండా మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చేసిన ప్రతి ఒక్క ప్రకటన కూడా పలు వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈయన చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఒక వ్యాపార ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.
ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనలో పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయని, ఈ ప్రకటన అందరిని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల పై అలాగే ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ పై ఈయన అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల జూన్ 6వ తేదీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి పలు పత్రికల్లో ఐఐటీ(IIT), ఎన్‌ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశారు.అయితే ఈయన ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చైతన్య విద్యా సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన జొమాటో, ర్యాపిడో ప్రకటనలో కూడాపెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి చైతన్య విద్యా సంస్థల నుంచి ఈయన ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…