Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటుడిగా మంచి గుర్తింపు పొందారు.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఏకంగా తొమ్మిది సినిమాలను రిజెక్ట్ చేశారు. ఇందులో ఏకంగా ఐదు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.అయితే అప్పట్లో కొన్ని సినిమాలు కథ నచ్చక రిజెక్ట్ చేయగా మరికొన్ని సినిమాలు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారు. మరి తన సినీ కెరీర్ లో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన సినిమా భీష్మ. ఈ సినిమా ముందుగా విజయ్ దేవరకొండ నటించాల్సి ఉంది. అయితే కథ నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కథ నచ్చకపోవడం విజయ్ దేవరకొండ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే కొరటాల శివ విజయ్ దేవరకొండకు కథ చెప్పిన ఆ కథ కూడా నచ్చకపోవడంతో ఈయన కొరటాలకు నో చెప్పాడు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కి రెండు సినిమాలకు విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారు.అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం చేయాలని కరణ్ భావించిన కుదరలేదు. వీటితోపాటు ఆర్ఎక్స్ 100, బుచ్చిబాబు ఉప్పెన, వంటి సినిమాలలో నటించే అవకాశం ముందుగా విజయ్ దేవరకొండకు వచ్చింది. ఇలా విజయ్ దేవరకొండ తన కెరియర్ లో ఐదు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…