Featured

Payal Rajput : సిగ్గుపడుతూనే వేదికమీద లిప్ లాక్ తో రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్…!

Payal Rajput : RX 100 సినిమాలో కార్తికేయకి జోడి గా పాయల్ రాజ్ పుత్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో కుర్రకారుని ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలోని వీళ్లిద్దరి కెమిస్ట్రీ తో టాలీవుడ్ లో పాయల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. RX100 తొలి సినిమానే అయినప్పటికీ రొమాంటిక్ సన్నివేశాల్లో ఓ రేంజ్ లో రచ్చ చేసింది పాయల్. దీంతో టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంది. కాకపోతే సరైన కథను ఎంచుకోక కాస్త తడబడుతోంది. ప్రస్తుతం పాయల్ మంచు విష్ణు హీరోగా వస్తున్న గాలి నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు జీ మహోత్సవాలలో భాగం కానుంది.

స్టేజ్ మీదనే ప్రియుడి తో రెచ్చిపోయిన పాయల్……

జీ టీవీ లో జీ మహోత్సవాలు కార్యక్రమం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమినికి సంబంధించిన ఒక ప్రోమో ఇపుడు హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. అయితే ఈ వేడుకలో పాయల్ తన ప్రియుడు అయిన సౌరభ్ దింగ్రతో కలసి జీ మహోత్సవం వేదిక మీద ఒక రొమాంటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ వేడుక ఆదివారం సాయంత్రం ప్రసారం అయింది. రొమాంటిక్ డాన్స్ చేసి అందరిని ఫిదా చేసారు. అయితే ఇందులో పాయల్ ఇంకా సౌరబ్ మధ్య కెమిస్ట్రీ తో రచ్చ చేశారు అనే చెప్పాలి. అయితే పాయల్ ఇంకో అడుగు ముందుకు వేసి తన ప్రియుడికి వేదిక మీదనే లిప్ లాక్ ఇచ్చి అందరిని షాక్ లో పడేసింది.

అయితే దీనికి హోస్ట్ గా వ్యవహారిస్తున్న శ్రీముఖి వీరిద్దరితో కాసేపు ఒక ఆట ఆడుకుంది. పాయల్ రాజ్ పుత్ తన మెడలో బేబీ అని ఉన్న నెక్ లెస్ ధరించింది. దీంతో శ్రీముఖి,మీ ఇద్దరి మధ్య సీక్రెట్ ఏంటో నాకు అర్థమైంది. సౌరబ్ మిమ్మల్ని బేబీ అని పిలుస్తాడు కదా, అందుకే మీరు మెడలో బేబీ అనే నెక్ లెస్ ధరించారు అని అడిగింది. అందుకు పాయల్ రాజ్ పుత్ సిగ్గుతో తడిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఫ్యామిలీతో కలిసి చూసే కార్యక్రమంలో ఏంటిది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే పాయల్ తన బాయ్ ఫ్రెండ్ తో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago