Categories: FeaturedMovie News

ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ ఒకరు. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లికి సంబంధించి వచ్చినన్ని రూమర్లు మరే హీరోపై రాలేదు. ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారని, భీమవరం అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని… వైరల్ అవుతున్న వార్తలు అబద్ధమని తేలింది.

బాహుబలి సినిమా విడుదల తరువాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అభిమానులు భావించినా ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాహుబాలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ నటించబోయే మరో రెండు సినిమాలు హిట్టైతే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఎంతో మంది అమ్మాయిలకు ప్రభాస్ కలల రాకుమారుడు. అయితే ఆ కలల రాకుమారుడి మనస్సును మాత్రం ఒక యువతి కొల్లగొట్టింది. ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ కు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించాడు. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం లేడీ ఫ్యాన్స్ తో ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో చెన్నై డాన్ బాస్కో స్కూల్ లో చదువుతున్న సమయంలో స్కూల్ టీచర్ పై క్రష్ ఏర్పడిందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

తన ఫస్ట్ క్రష్ అయిన టీచర్ ముఖం తనకు ఇంకా గుర్తుందని తెలిపాడు. ప్రభాస్ గతంలో చెప్పిన ఆ విషయం ప్రస్తుతం ప్రభాస్ ఆర్మీ సోషల్ మీడియా పేజీ ద్వారా వైరల్ అవుతోంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో, ఓం రౌత్ దర్శకత్వంలొ ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago