పిల్లలలో కోపం,చిరాకు ,మొండితనానికి కారణం తల్లిదండ్రులని మీకు తెలుసా….?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు డబ్బు సంపాదన ఉరుకుల పరుగుల జీవితంతో పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి కష్టపడుతూ వారి బాగోగులు కూడా చూడకుండా డబ్బు సంపాదన పడిపోయారు. కానీ డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలం అనుకుంటే అది పొరపాటే.

తల్లిదండ్రులు రాత్రి పగలు ఉద్యోగాలు అంటూ పిల్లల్ని కేర్ టేకెర్స్ దగ్గర వదిలి వెళ్లడం, వారి చదువు కోసం పిల్లల్ని ఉదయమే స్కూల్ కి పంపించడం రాగానే మరి ట్యూషన్ కి పంపడం వారితో సమయమే గడపకుంటే మీ పిల్లల మొండి తనానికి ,చిరాకుకి మీరే కారణం అవుతారు.

ఉద్యోగాల పనిలో పడి పిల్లలతో సమయం గడపకుండా ఉంటున్నాము. కానీ మన పనిని కాస్త పక్కన పెట్టి వారితో ప్రేమగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలతో సమయం కేటాయిస్తూ వారిని బయటికి తీసుకుని వెళుతూ ఉండాలి. రోజుకి కొద్ది సమయం పిల్లలతో గడిపి వారి బాగోగులు వారి ఇబ్బందులు గురించి తెలుసుకోవాలి.

పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో వారి సమస్యలు గురించి మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటే వారు ఎటువంటి ఒంటరితనాన్ని ఫీలవకుండా ఉంటారు. అలాగే తల్లిదండ్రుల పై ఎలాంటి కోపం చిరాకు లేకుండా మనతో ఎంతో స్నేహభావం గా ఉంటారు.