కమెడియన్ బ్రహ్మానందం ఈయన పేరు వినగానే చాలా మందికి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది.అలా కామెడీకి మారుపేరుగా నిలిచిన నటుడిగా బ్రహ్మానందం ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్నారు.మూడున్నర దశాబ్దాల కాలం నుంచి బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన కామెడీ ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
బ్రహ్మానందం తన సినీ కెరీర్లో సుమారు 1200 చిత్రాలకు పైగా నటించి రికార్డు సృష్టించారు. ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్న బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో వయసు పైబడటం వల్ల సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే ఇతను సినిమాలకు దూరంగా ఉండటం వల్ల తనకు అవకాశాలు తగ్గిపోయాయని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బ్రహ్మానందం తనకు అవకాశాలు తగ్గలేదని తానే అవకాశాలను తగ్గించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇలా కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన బ్రహ్మానందం తన శరీరానికి విశ్రాంతి కావాలని అందుకే సినిమాలలో నటించడం లేదని తెలిపారు.ఇక కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందాన్ని మనస్ఫూర్తిగా నవ్వించే వ్యక్తి ఒకరు ఉన్నారని ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి ఈయన ఒక కార్యక్రమంలో తెలిపారు.
బ్రహ్మానందం మనవడు పార్ధు తన కుటుంబంలోకి వచ్చిన తర్వాత తనని బాగా నవ్విస్తున్నాడని తెలిపారు. ఏ విషయం గురించి అయినా తను మాట్లాడినప్పుడు నీకు తెలియదులే తాత అలా కాదు అంటూ మాట్లాడతాడని, అలా కాదు నాన్న అంటూ నేను వివరించే ప్రయత్నం చేసిన రామకృష్ణ అంటూ తల బాదుకుంటూ తనని మనస్ఫూర్తిగా నవ్విస్తాడని ఈ సందర్భంగా బ్రహ్మానందం తన మనవడు గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…