తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న నటి లహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె మా టీవీలో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమెను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఈమెను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తమ విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో నటి లహరి కారు ఆ వ్యక్తిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్ర గాయాలు పాలవగా, లహరి మాత్రం కారు నుంచి బయటకు దిగకపోవడంతో పెద్దఎత్తున స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి అనంతరం ఆమె కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బాధితులు ఈమె గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని తెలిసినప్పటికీ ఈమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న లహరి ఇలా అరెస్టు కావడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…