బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. అలాంటి వాటిలో ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా ఒకటి. ఈ షోకు ఇప్పటికే నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుండగా, ఈ షోలో ఈ సారి కొద్దిగా మార్పులు చేసి దీనిని జెమినీ టీవీ వాళ్లు ప్రసారం చేశారు.బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటివరకు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి సందడి చేశారు.ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అద్భుతంగా ఆడుతూ ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, ప్రేక్షకులను అలరిస్తూ 25 లక్షలు గెలుచుకున్నారు.
అనంతరం తదుపరి ఎపిసోడ్ కి డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరిద్దరూ కూడా 25 లక్షల రూపాయల గెలుచుకున్నారు. అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ షో లో కనిపించి సందడి సందడి చేసింది. సమంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 25 లక్షల రూపాయలు తీసుకుంది. ఇక చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షో కి వచ్చారు.ఈ క్రమంలోనే తన సినిమాలకు సంబంధించి, ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మహేష్ బాబు కూడా 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఈ షో కి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రేట్ ఇప్పుడు 25 లక్షలు గెలుచుకోవడం ఏమిటి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ షో కి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కేవలం 25 లక్షలు మాత్రమే గెలుచుకోవడంతో ఈ కార్యక్రమం గురించి ముందుగానే తెలియజేశారు అన్నా సందేహాలు తలెత్తుతున్నాయి. సెలబ్రిటీలకు ముందుగా సమాచారం ఇవ్వడంతో 25 లక్షల వరకు మాత్రమే ఈ షోలో గెలుచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు సెలబ్రిటీలకు కేవలం 25 లక్షలు గెలుచుకున్న అంత తెలివి మాత్రమే ఉందా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నార
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…