Dil Raju : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరు హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ పూట హడావిడి చేస్తుంటాయి. అయితే ఈ సారి పండగకు పెద్ద సినిమాలే కాకుండా తమిళం నుండి విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తోంది. ఇక చిన్న చిన్న సినిమలు చాలానే ఉన్నాయి. ఓవైపు మెగాస్టార్ మరోవైపు బాలయ్య వీళ్ళ మధ్యలో తమిళ హీరో విజయ్.. ముగ్గురు పెద్దా హీరోల సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసాయి. అయితే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వస్తున్న ‘వారసుడు’ సినిమా విడుదల వాయిదా వేసుకుంటారు అనే వార్తలు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ రావాలి. ఇవన్నీ పక్కన పెడితే వారసుడు సినిమా విషయంలో దిల్ రాజు ను సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
అన్ని హిట్ సినిమాలు కలిపి ఆ సినిమా…
వారసుడు సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక సినిమా ట్రైలర్ తెలుగులో హిట్ అయిన పెద్ద హీరోల సినిమాలైన అలా వైకుంఠపురం, బ్రహ్మోత్సవం, మహర్షి, శ్రీమంతుడు వంటి సినిమాల కాపీలా ఉందంటూ ట్రోల్స్ చేశారు. ఇక ఈ విషయంలో మీడియా సమావేశంలో దిల్ రాజుకి ప్రశ్న ఎదురుకాగా అవును అంటూ సాలిడ్ రిప్లై ఇచ్చారు. శతమానం భవతి సినిమా విడుదలకు ముందు సీరియల్ లాగా ఉంటుందంట కదా అని అడిగేవారు.
ఇప్పుడు వారసుడు సినిమా ను కొత్త తెలుగు హిట్ సినిమాల కాపీ అంటున్నారు. ట్రైలర్ లో కొద్దిగా చూసి సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ మీరే ఉహించుకుంటారు అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు. మొత్తానికి వారసుడు సినిమా తెలుగు సినిమాల కాపీ కాదు ఇందులో కొత్తదనం ఉంది చూడండి అంటూ చెప్పారు దిల్ రాజు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…