Prabhas: నందమూరి నరసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హాజరైన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా ఆహా ప్రసారం చేసింది.
ఇక ఈ ఎపిసోడ్స్ అత్యధిక రేటింగ్ కైవసం చేసుకున్నాయి. ప్రభాస్ అభిమానుల దాటికి ఏకంగా ఆహా క్రాష్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక తెరపై ప్రభాస్ గోపీచంద్ చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అయితే తెర వెనక ప్రభాస్ ఆహా టీంతో కలిసి చేసిన అల్లరికి సంబంధించిన వీడియోని ఆహా విడుదల చేశారు.
ఈ వీడియోని ఆహా షేర్ చేస్తూ బిహైండ్ ది సీన్ అంటూ వీడియో విడుదల చేయడంతో ఇందులో ప్రభాస్ చేసిన అల్లరి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సెట్టులో బాలకృష్ణ ప్రభాస్ తో మాట్లాడుతూ మీట్ ది రియల్ సైడ్ ఆఫ్ బాలకృష్ణ అని పరిచయం చేసుకోవడంతో అయ్యో సార్ నాకు తెలుసు అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకు మరొక కుటుంబం లాంటిది అంటూ బాలయ్య ప్రభాస్ కి వివరించారు.
ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఆహా టీంతో చేసిన అల్లరి అలాగే ప్రభాస్ బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో విడుదల కావడంతో ప్రభాస్ అల్లరి చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకి మంచి ఆదరణ లభించడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ అల్లరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…