Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి కూడా పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా కేరవాన్ కల్చర్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ అంటే తప్పనిసరిగా హీరో హీరోయిన్లకు క్యారవాన్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక మరికొందరు స్టార్ హీరోలైతే వారి సొంత కేరవాన్ లను తీసుకెళ్తుంటారు.ఒకానొక సమయంలో చిత్ర బృందానికి ఈ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోవడంతో షూటింగ్ సమయంలో ఇబ్బంది పడినప్పటికీ చిత్ర బృందం మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం క్యారవాన్స్ రావడం వల్ల సెలబ్రిటీలు వారి షాట్ పూర్తి కాగానే వెళ్లి కేరవాన్ లో రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కల్చర్ వల్ల నిర్మాతలు ఎంతగానో నష్టపోతున్నారని ఈయన వెల్లడించారు. హీరో లేదా హీరోయిన్లు ఒక షాట్ పూర్తి కాగానే వెళ్లి కారవాన్ లో రిలాక్స్ అవుతున్నారు.
తిరిగి షాట్ రెడీ అవ్వగానే ముందుగా వారి అసిస్టెంట్లను పిలిచి హీరో హీరోయిన్లకు కబురు పంపాలి. వారు వెళ్లి చెప్పిన అనంతరం హీరోలు లొకేషన్ లోకి వస్తారు. అప్పటికే దాదాపు 15 నిమిషాల సమయం వృధా అవుతుంది.అదేవిధంగా ఈ కారవాన్స్ రావడం వల్ల నిర్మాతలకు నష్టం రావడమే కాకుండా హీరో హీరోయిన్లకు డిసిప్లేన్ కూడా తగ్గిపోయింది అంటూ దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…