Movie News

Dil Raju: కోలీవుడ్ స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టిన దిల్ రాజు… అవి చూసి తట్టుకోగలరా?

Dil Raju:తెలుగు చిత్రపరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రతి ఏడాది సంక్రాంతికి తన నిర్మాణంలో ఏదో ఒక సినిమా విడుదల చేయడము లేదా ఇతర సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి దిల్ రాజుకు పెద్దగా కలిసి వచ్చినట్టు లేదేమోనని పలువురు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈయన నిర్మాణంలో వస్తున్నటువంటి వారసుడు సినిమా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. దిల్ రాజు విజయ్ హీరోగా వరిసు సినిమాని తమిళంలో నిర్మించి తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేస్తున్నారు.అయితే గతంలో ఒకసారి సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజు చెప్పిన మాటలనే ఇప్పుడు తిరిగి ఆయనకే సూచించడం గమనార్హం.

దిల్ రాజుకు మద్దతుగా పలువురు టాలీవుడ్ నిర్మాతలు నిలబడి తెలుగు రాష్ట్రాలలో కూడా వారసుడు సినిమాకి తగినన్ని థియేటర్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళంలో వరీసు సినిమాతో పాటు అజిత్ తునివు సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రావడంతో ఈయనకు మరో సమస్య వచ్చి పడింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడంతో ఇద్దరికీ థియేటర్లో సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు సమాచారం. అయితే విజయ్ సినిమాకు ఆధారంగా మరికొన్ని థియేటర్లు కావాలని కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ నెంబర్ వన్ హీరో కనుక అతను సినిమాకు మరికొన్ని థియేటర్లు అదనంగా ఇవ్వాలని కోరారు.

Dil Raju:

ఈ విధంగా అజిత్ ను తక్కువ చేసి విజయ్ ను పొగడటంతో అజిత్ ఫాన్స్ ఈ విషయంలో తీవ్రస్థాయిలో దిల్ రాజు పై మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం దిల్ రాజు చెన్నై వచ్చినప్పుడు అజిత్ ఫ్యాన్స్ పవర్ ఏంటో తనకు చూపించాలని అజిత్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ విషయం దిల్ రాజు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారని అవి చూసి దిల్ రాజు తట్టుకోలేరని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే దిల్ రాజు చాలా సామరస్యంగా ప్రవర్తించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

19 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago