Dil Raju: సిగ్గు, మానం లేకుండా ఉండడమే చిత్ర పరిశ్రమ… సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు!

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టే అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సినిమాల ఎంపిక విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ ఎప్పుడు ఫర్ఫెక్ట్ గా ఉంటుందని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.

ఈ క్రమంలోనే సరైన అవగాహనతో ఈయన ఏకంగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబంలా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇక్కడ అలా ఉండదు. ఎవరి దారి వాళ్ళదే.ఇండస్ట్రీలో కొనసాగాలంటే సిగ్గు నీతిమానం ఇవన్నీ వదిలేస్తేనే ఇండస్ట్రీలో ఉండగలమంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా చూడకుండా డిస్ట్రిబ్యూటర్లు కొనే వస్తువు సినిమా అని, దారుణమైన పరిస్థితి ఏమిటంటే డిస్టిబూటర్లు కూడా ప్రేక్షకులతో పాటు థియేటర్లో సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

Dil Raju: నన్ను చూస్తే అసూయ వాళ్ళు ఉన్నారు…

ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్లు కొన్నిసార్లు లాభాలు పొందిన ఎక్కువ శాతం నష్టపోయే పరిస్థితిలో ఏర్పడతాయని అందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పూర్తిగా నష్టపోతుందంటూ తెలియజేశారు. తాను కూడా మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల నష్టపోయాయని ప్రస్తుతం కాస్త లాభాలు అందుకున్నానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలో తానంటే అసూయ పడేవారు చాలామంది ఉన్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.