Movie News

Director Anudeep Meme Viral: స్టేజ్‌పైకి వెళ్తుంటే నెట్టేసిన పోలీస్.. పాపం డైరెక్టర్ అనుదీప్ !

యూత్‌ఫుల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ అనుదీప్ మరోసారి న్యూస్‌లోకి వచ్చాడు. అయితే డైరెక్టర్ అనుదీప్ మూవీ అప్‌డేట్ వల్ల కాదు, ఓ ఫన్నీ మీమ్ వీడియో వల్ల!

Director Anudeep Meme Viral: The police pushed him on his way to the stage..

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనుదీప్ స్టేజ్ మీదికి వెళ్లే క్రమంలో అతడిని గుర్తుపట్టలేకపోయిన సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తిప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకసారి నెట్టింట్లో పడిందంటే చాలు… నెటిజన్లు పిచ్చి పిచ్చిగా నవ్వేస్తున్నారు! “పాపం మావ డైరెక్టర్” అంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.

‘జాతిరత్నాలు’ బ్రాండ్ అనుదీప్
అనుదీప్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాతోనే అతను యూత్‌లో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కిరాక్ కామెడీ, టైమింగ్ పంచులు, బూటకపు ఫీలింగ్స్ తో సినిమా మొత్తాన్ని నవ్వుల పంటగ మార్చాడు. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో చేసిన ‘ప్రిన్స్’ అంతగా వర్కవుట్ కాలేకపోయినా, అనుదీప్ బ్రాండ్ కామెడీ మాత్రం మిస్సయ్యలేదు.

రవితేజతో కాంబో ప్లాన్?
ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాక్ ఏంటంటే, అనుదీప్ తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట! ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు ఇప్పటికే జరిగాయంటూ సమాచారం. ఒకవేళ ఇది కన్ఫర్మైతే – ఆ కాంబో గురించి ఊహించడమే సరిపోతుంది. రవితేజ స్క్రీన్ పై ఎనర్జీ, అనుదీప్ స్క్రీన్ పై టైమింగ్, ఇద్దరి కలయిక అంటే యూత్‌కు డబుల్ డోస్ కామెడీ ఖాయం!

నెటిజన్ల కామెడీ ర్యాక్షన్లు:
“డైరెక్టర్ అయితే ఏంటి సార్.. ఐడీ చూపించాలి!”

“జాతిరత్నాలు కాదు.. స్టేజిరత్నాలు!”

“వెనక్కి తిప్పిన పోలీస్ కు స్క్రిప్ట్ ఇవ్వండి సర్.. కామెడీ సెటైర్ రోలే పండుతుంది” అంటూ మీమ్స్ గోలుగోలున పేలిపోతున్నాయి.

ఒక చిన్న వీడియోతో నెట్టింట మరోసారి పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్, త్వరలోనే మాస్ మహారాజ్‌తో సినిమా చేస్తే… అది నవ్వుల పండగ కావడంలో సందేహం లేదు!

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago