Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes
ఢిల్లీలో కొత్త వాహన పాలసీ వార్తలు వెలువడిన దగ్గర నుంచి భారీగా కలకలం రేగింది. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన డీజిల్ కార్లు, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం అందవు, బంకుల్లో ఫ్యూయెల్ నింపలేరు అంటూ సర్కార్ ప్రకటించిన తర్వాత వాహన యజమానులు ఆందోళనకు లోనయ్యారు.
పాలసీ ప్రకటనతో ఎఫెక్ట్:
విలువైన కార్ల యజమానులు భయంతో వెంటనే తమ వాహనాలను మార్కెట్లో పెట్టారు. మెర్సిడెస్, ల్యాండ్ రోవర్, లగ్జరీ SUVలు కూడా చౌక రేట్లకే అమ్ముడుపోయాయి. ఒకరు రూ.82 లక్షల కారును రూ.2.5 లక్షలకే వదిలేశాడు. ఇంకొకరు రూ.65 లక్షల ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకు అమ్మేశాడు. అసలు విలువలకు ఒక్క పావు కూడా లేని ధరలకే కార్లు పోయాయి.
సోషల్ మీడియాలో ఆవేదన:
ఈ వ్యవహారంపై కారు యజమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ బాధ వ్యక్తం చేస్తున్నారు. “అయితే ముందే చెప్పాలి కదా! ఇప్పుడు వెనక్కి తగ్గితే మేం మోసపోయినట్టేనా?” “ఎవరు బాధ్యత వహిస్తారు? మా లక్షల రూపాయలు విలువ తగ్గిపోయింది!” అంటూ ఫైరవుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయం వెనక్కి ఎందుకు తీసుకుంది?
వాహన యజమానులు, ఆటోమొబైల్ అసోసియేషన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బీజేపీ ప్రభుత్వం పాలసీ అమలును నిలిపివేసింది. జులై 1 నుంచి అమలు చేస్తామన్న నిర్ణయం వాయిదా వేసింది.
బాధితుల మాటల్లోనే:
“ఒక పొలిసీతో ప్రజలను ఈ స్థాయిలో మోసగించడం దారుణం. ఇప్పటికీ ఎవరూ కనీసం చర్చించడానికి సిద్ధంగా లేరు!”
ప్రభుత్వం వాయిదా వేసిన پالసీ.. ప్రజల కోసం తగినదే అయినా, ముందే క్లారిటీ లేకపోవడం వల్ల వాహన యజమానులకు భారీ నష్టం జరిగినట్టయ్యింది. ఇప్పుడైనా ప్రభుత్వం సరైన సమాచారం, సమయానికి తీసుకున్న నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…