Featured

Director Atlee : ఎన్టీఆర్ కోసం తలపకట్టి బిర్యానీ తెచ్చిన అట్లీ… వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో..!

Director Atlee : బిర్యానీ అనగానే హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ అంత ఫేమస్ మరి. మరి ఈ తలపకట్టి బిర్యానీ ఏంటా అనుకుంటున్నారా, హైదరాబాద్ బిర్యానీ లాగే తలపకట్టి బిర్యానీ కూడా బాగా ఫేమస్ ఎక్కడో కాదు చెన్నైలో. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ లాగా అక్కడ తలపకట్టి బిర్యానీ అన్నమాట. ఇక బిర్యానీ మన ఎన్టీఆర్ ను కూడా ఊరించింది. అసలే భోజన ప్రియుడైన ఎన్టీఆర్ కి ఈ బిర్యానీ తినాలనిపించింది మరి. మాములుగా ఫుడ్ అంటే వండడం తినడం రెండింటిలోనూ ఎన్టీఆర్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే కెరీర్ మధ్యలో బాగా లావేక్కిపోయాడు. అయితే ఇపుడు యంగ్ టైగర్ చాలా మారిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా భోజనం ప్రియుడే. అయినా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు.

చెన్నై నుండి తలపకట్టి బిర్యానీ తెచ్చిన డైరెక్టర్ అట్లీ…

అయితే ఇపుడు ఈ చర్చంతా ఎందుకంటే డైరెక్టర్ అట్లీ తమిళంలో హిట్ సినిమాల డైరెక్టర్ గా ఉన్న ఈ యువ దర్శకుడు ఎన్టీఆర్ కి కథ చెప్పడానికి రావాలని అనుకున్నాడట. ఇక యంగ్ టైగర్ వెంటనే వచ్చేటపుడు తనకు తలపకట్టి బిర్యానీ తీసుకురమ్మని అడిగాడట.. అయితే ఈ విషయాన్ని అట్లీ చెప్పలేదు. తెలుగు సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ ఒక సందర్బంలో ఈ విషయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ అట్లీ తో తనకున్న స్నేహం కారణంగా బిర్యానీ ఆర్డర్ చేస్తే తినే వెళ్ళొచ్చుగా పార్సిల్ ఎందుకు అని అడిగాడట. దీనికి ఆయన ఇది నాకోసం కాదు ఎన్టీఆర్ కోసం అని విషయాన్ని చెప్పాడట.

ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో రాజారాణి, తేరి, బిగిల్, మెర్సీల్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు. అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్ డైరెక్టర్ శంకర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇపుడు ఎన్టీఆర్ కి కథ చెప్పడానికి వచ్చాడనగానే ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు మొదలైపోయాయి. మరి ఈ హైదరాబాద్ బిర్యానీ, తలపకట్టి బిర్యానీ కాంబినేషన్ లో సినిమా ఎపుడు ఉంటుందో మరి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago