ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య ఏ ముహూర్తాన విడాకులు ప్రకటన చేశారో అప్పటి నుంచి వరుసగా పలువురు విడాకులు ప్రకటన చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు
ఇలా సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన నుంచి అభిమానులు బయటపడకుండానే తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి ప్రకటించి మరో షాక్ ఇచ్చారు. ఎలా వీరి విడాకుల గురించి అందరూ షాక్ లో ఉండగానే మరొక స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. స్టార్ హీరో కుమార్తె విడాకుల విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
తాజాగా స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకున్నారు. అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి నేషనల్ అవార్డు సైతం అందుకున్న డైరెక్టర్ బాలా తన భార్య ముత్తుమలర్ తో విడిపోయారు. ప్రస్తుతం ఈ వార్త సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ 17 ఏళ్ల దాంపత్య జీవితానికి విడాకులతో ముగించారు. బాలా ఆయన భార్య ముత్తుమలర్.. ఈనెల 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్ళ క్రితమే వీరిద్దరికీ విభేదాలు తలెత్తాయని, గత నాలుగేళ్ళుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారట. అయితే పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారని తమిళ సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి..
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…