Featured

Director Geetha Krishna : రోజా గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు.. చిరంజీవి ఫ్యామిలీ పై రోజా కామెంట్స్ పై గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..!

Director Geetha Krishna : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు, సొంతంగా ఆలోచించలేడు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనడం గురించి వైసీపీ పార్టీ నేత మంత్రి రోజా మెగా ఫ్యామిలీ మీద అలాగే నందమూరి బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

రోజా ఎలాంటిదో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు…

ఏపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి విమర్శించడం కామన్ అయితే ఈ సారి మెగా ఫ్యామిలీ ఎవరికీ సహాయం చేయరు అంటూ మాట్లాడి వైరల్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరులు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరికీ సహాయం చేయలేదు అంటూ మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీన్ని గురించి గీతా కృష్ణ మాట్లాడుతూ రోజా ఆడవారు మాట్లాడలేని బూతులను కూడా సభల్లో మాట్లాడిన ఘటనలు ఉన్నాయి.

తాను విమర్శిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో కానీ ఎపుడు మాట్లాడినా ఎంతో కొంత కొద్ది మంది పైన అయినా ప్రభావం చూపించవచ్చు. రోజాను చాలా మంది పరుషంగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు ముగ్గురు పెద్ద హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తే వారి వారి ఫాన్స్ ఊరికే ఉండరు ఆమెను బాగా విమర్శిస్తారని తెలిసినా సీఎం దగ్గర మెప్పుకోసం ఎంతో కొంత నా వాదన సమర్తిస్తారని భావించి ఉండవచ్చు అంటూ తెలిపారు. ఒకప్పట్లో మెగా ఫ్యామిలీ ఎవరికీ సహాయం చేయరు అనే అపవాదు ఉండేది, దీనికి కారణం రాజకీయంగా బురద వేయడమే. అలాంటి ఆరోపణలే మళ్ళీ రోజా కూడా చేస్తోంది. అందులోనూ ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి కావడం వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఈ ఆరోపణలను నమ్ముతారు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago