Categories: FeaturedMovie News

(నిజంగానే క్యాన్సర్ ఉన్న అమ్మాయి గీతాంజలి) మణిరత్నం “గీతాంజలి” టైటిల్ వెనుక ఉన్న రహస్యం..!!

కన్ను తెరిస్తే జననం..!! కన్ను మూస్తే మరణం…!! అన్నాడో మహాకవి సమాజాన్ని మానవసంబంధాలను ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప గుండెల్ని పిండే పదాలు కవి కలానికి అంత సులువుగా దొరకవు. గీతాంజలి సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ చిత్రించిన అద్భుతం కళాఖండం మరో రూపం గా పేర్కొనవచ్చు. బావు కతను నింపుకున్న ఓ కవి మనిషి హృద్యంతరాలను తాకే సుమధుర సుందర గీతమాలిక ఆనాటి గీతాంజలి చిత్రం.

కళాత్మక దర్శకుడు మణిరత్నం అనేక మాసాలుగా తన మస్తిష్కంలో దాచుకున్న ప్రేమ కావ్యం గీతాంజలి కథ. మణిరత్నం, ఇళయరాజా, బాలు, వేటూరి, పీసీ శ్రీరామ్ లాంటి పంచకళారత్నాలు ఈ చిత్రానికి పనిచేశారు. ఇళయరాజా సంగీతం నుండి జాలువారిన గీతాలు ఇప్పటికీ శ్రోతలను కట్టిపడేస్తుంది. “వేటూరి కలం బాలు గళం” ఈ సినిమాని మరో మెట్టుకు తీసుకెళ్ళింది. ఇందులోని అనేక దృశ్యాలు పూర్తిగా వెలుగులో కాకుండా అలా అని పూర్తిగా చీకటిలో కాకుండా వెలుగునీడల మిశ్రమంతో సృజనాత్మకంగా తీసి పీసీ శ్రీరామ్ గీతాంజలి సినిమా పతాక స్థాయికి తీసుకెళ్లారు.

ఆనాటి అనార్కలి, లైలా మజ్ను, మరో చరిత్ర అ అభినందన లాంటి చిత్ర ప్రేమ కావ్యాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. వాటి సరసన చేరిన మరో అరుదైన ప్రేమ కావ్యం గీతాంజలి. ఈ విషాద చిత్రాల్లో ఏ సినిమాను తీసుకున్నా నాయకానాయికలకు ఏదైనా ప్రమాదం జరగడమో లేదా ప్రాణాంతకమైన జబ్బు రావడమో లాంటివి జరగడంతో చుట్టూ ఉన్న పాత్రలు విషాద వదనములో మునిగి చివరకు ప్రేమికుల్లో ఎవరో ఒకరు మరణించడంతో అంతిమంగా ప్రేక్షకులు బరువైన హృదయంతో నిష్క్రమించడం జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే గీతాంజలి సినిమా షూటింగ్ జరుగక ముందు ఢిల్లీలో ఒక అమ్మాయి క్యాన్సర్ మహమ్మారితో చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న దర్శకుడు మణిరత్నం ఆమె గురించి వాకబు చేశాడు. ఆమె పేరు గీతాంజలి అని తెలిసి కన్నీటి పర్యంతమై తను తీసిన సినిమాకు గీతాంజలి అని టైటిల్ పెట్టి అప్పటి వరకు లేని అరుదైన విజయాన్ని మణిరత్నం అందుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago