టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన కేవలం తెలుగు సినిమాలు తెరకెక్కించడం కాకుండా అప్పుడప్పుడూ సామాజిక బాధ్యత గల పనులను కూడా చేస్తూ అందరి ప్రసంశలు పొందుతుంటారు. ఇందుకు ఉదాహరణగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు మద్దతుగా నిలిచాడు దర్శకుడు మారుతి. అదేంటి.. అనుష్క శర్మకు మారుతికి సంబంధం ఏంటి.? అసలు వీళ్లిద్దరూ ఎప్పుడైనా కలిశారనే సందేహాలు మీకొస్తే ఈ అంశాన్ని పూర్తిగా చదివెయ్యండి.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ విషయంలో ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మారుతికి చాలా కోపం తెప్పించాయి. దాంతో ఆమెను ఓ రేంజ్‌లో విమర్శించాడు మారుతి. వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ భామ అనుష్క శర్మ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే.. గత నెల అనుష్క, విరాట్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా వెల్లడించారు. దీనితో అనుష్క ఫాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలందరూ ఆ దంపతులిద్దరినీ విష్ చేశారు. అయితే తాజాగా అనుష్క మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?’ అంటూ అనుష్క శర్మ పోస్ట్ చేసింది. హీరోయిన్లంతా తమ బేబీ బంప్ ను ఇలా చూపించుకోవడం కొత్తేంకాదు. అనుష్క కూడా అదే పని చేసింది. కానీ దానిపై విమర్శలు చెలరేగాయి.
“విరాట్ కోహ్లి కేవలం నిన్ను గర్భవతిని మాత్రమే చేశాడు.. ఇంగ్లాండ్ దేశానికి రాణిని చేయలేదు.. ఎక్కువగా ఆవేశపడకు” అంటూ ఓ మహిళా జర్నలిస్ట్ విమర్శిస్తే.. మరొకరు “ఇప్పుడు ఇలానే వీళ్లు తమ గర్భాన్ని చూపిస్తారు.. బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆశీర్వదించడానికి కూడా టచ్ చేయనివ్వరు” అని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నా నేపథ్యంలో మన టాలీవుడ్ డైరెక్టర్ మారుతి మాత్రం అనుష్కకు మద్దతుగా నిలిచాడు. “అమ్మతనం అనేది ఇంగ్లండ్ కు రాణి అవ్వడం కంటే గొప్ప విషయమని.. ఈ విషయంలో ప్రతి తల్లి, మహారాణితో సమానమేనని.. ప్రతి ఇల్లు రాజ్యమేనని” సీరియస్ గా కామెంట్ చేశాడు మారుతి. సెలబ్రిటీ కంటే ముందు అనుష్క కూడా ఓ మహిళ అనే విషయాన్ని అంతా గుర్తించాలని, తన అమ్మతనాన్ని చూపించుకునే హక్కు ఆమెకు ఉందని సమర్థించాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…