Categories: FeaturedMovie News

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నందుకు గంగవ్వకు ఎంతిస్తున్నారో తెలుసా.?!

బుల్లితెరపై మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలైన సంగతి తెలిసిందే.! అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ షో నడిచినన్ని రోజులు ఎవరికీ కాంటాక్ట్ లేకుండా ఉండాలి కాబట్టి వచ్చే కంటెస్టెంట్స్ కూడా మాములుగా తీసుకునే అమౌంట్ కి డబల్ తీసుకుంటారు. బిగ్ బాస్ కూడా అలాగే చెల్లిస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు రోజుకి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాస్తవానికి బిగ్ బాస్ లో పాల్గొనే వాళ్ళకి మినిమమ్ రోజుకి 10 వేల నుంచి పేమెంట్ ఉంటుంది. ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్లకి ఎక్కువ ఇస్తారు. తక్కువ ఫేమ్ ఉన్న వాళ్లకి తక్కువగా ఇస్తారు. కానీ మినిమమ్ 10 వేలు ఉంటుంది.

అయితే ఈసారి సీజన్ 4షోలో ఉన్న వాళ్లలో ఎవరు అంత ఫేమస్ కాదు.. యాంకర్ లాస్య అందరికి తెలుసు. లాస్యకి రోజుకి 50 వేలకు పైగానే ఇస్తున్నారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ కి కూడా 40 వేలకు పైగా ఇస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ కి కూడా 40 వేలకు పైగా ఇస్తున్నారు. డైరెక్టర్ సూర్యకిరణ్ కి 10 వేలకు పైగా ఇస్తున్నారు. అభిజిత్ కి 20 వేలకి పైగా ఇస్తున్నారు. జోర్దార్ యాంకర్ సుజాతకి 10 వేలకి పైగా ఇస్తున్నారు. మెహబూబ్ దిల్‌సే కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. టీవీ 9 యాంకర్ దేవికి 20 వేలకి పైగా ఇస్తున్నారు. దేత్తడి హారికకి 25 వేలకి పైగా ఇస్తున్నారు. టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్ కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. యాంకర్ అరియానా గ్లోరీకి 10 వేలకి పైగా ఇస్తున్నారు. కరాటే కళ్యాణికి 25 వేలకి పైగా ఇస్తున్నారు. సింగర్ నోయల్ కి 40 వేలకి పైగా ఇస్తున్నారు. మోడల్ దివికి 10 వేలకి పైగా ఇస్తున్నారు. అఖిల్ సార్థక్ కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. అలాగే ఈమధ్య వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ కుమార్ సాయికి 10 వేలకి పైగా ఇస్తున్నట్టు తాజా సమాచారం. వీళ్లందరికన్నా ముఖ్యంగా హోస్ట్ చేసే కింగ్ నాగార్జునకు షో మొత్తానికి కలిపి 8 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంభందించిన ట్విస్ట్ ఏమిటంటే.. ఇంత వరకు ఏ భాషలోను బిగ్ బాస్ సీజన్స్ లో కనిపించని సంఘటన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో జరగడం బుల్లితెర ప్రేక్షకులకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే.. బిగ్ బాస్ అంటేనే అందమైన ముద్దుగుమ్మలు.. యంగ్ & డైనమిక్ కుర్రాళ్ళ తో సరదాలు.. సందడి.. రొమాన్స్..కాంట్రవర్సీలు.. అని అందరూ ఫిక్సైపోయారు. అలాంటి బిగ్ బాస్ లో మొదటి సారిగా 60 ఏళ్ళ వయసున్న ఒక పల్లెటూరు వ్యక్తి, చదువుకోని గంగవ్వను బిగ్ బాస్ సీజన్ 4లోకి తీసుకోవడం పెద్ద ప్రయోగమని చెప్పాలి. అంతేకాకుండా ఈ షోలో గంగవ్వ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలామంది గంగవ్వ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.! మొదటి వారమే గంగవ్వకు 2 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయంటే ఆమెకున్న గుర్తింపు ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరూ గంగవ్వకు మద్దతు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. గంగవ్వ వలెనే బిగ్ బాస్ షో నిర్వాహకులు మంచి లాభాలను పొందుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గంగవ్వ కు బిగ్ బాస్ లో వారానికి 3 లక్షల పారితోషికం ఇస్తున్నారట. బిగ్ బాస్ షోలో పాల్గొంటూ సంపాదించిన ఆ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని గంగవ్వ కళలు కంటుందంట. మరి మనం కూడా గంగవ్వ ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago