Director PNR : పిఎన్ రాంచంద్రం రావు… దర్శకుడిగా నిర్మాతగా తెలుగు, కన్నడ, తమిళ్ లో ఎన్నో సినిమాలను తీసారు. కొత్త నటులను పరిచయం చేయడంలో కూడా ముందుంటారు. ‘మానవరాలి పెళ్లి’ సినిమాతో సౌందర్యను, ‘సహనం’ సినిమాతో విలన్ గా ప్రకాష్ రాజ్ ను, ‘లీడర్’ సినిమాతో ప్రియారామాన్ ను, ‘జాక్ పాట్’ సినిమాతో నవీన ను, ‘గోల్ మాల్’ సినిమాతో నేహా, మీరా వాసుదేవన్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు. అంతే కాకుండా సినిమాలలో హీరోగా కనిపించే ముందు ఎన్టీఆర్ ను ‘భక్త మార్కాండేయ’ అనే తెలుగు సీరియల్ లో చూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పిఎన్ఆర్ తాను సినిమాలలో నష్టపోయిన దాని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
రామ్ చరణ్ సినిమా వల్ల బాగా నష్టపోయాను…
ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే కోరికతో నాలుగేళ్లకు పైగా ఎదురుచూసిన పిఎన్ఆర్ గారు ఆ అవకాశం అందుకోలేక పోయారు. ఇక డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగులేసిన ఆయన రామ్ చరణ్ ‘తుఫాన్’ సినిమాకు దాదాపు 12 కోట్లు పెడితే 7 కోట్లు నష్టపోయారట. అంతవరకు 45 సినిమాల ద్వారా సంపాదించిన మొత్తం డబ్బులు ఒక్క సినిమాతో పోయాయంటూ తెలిపారు.
ఇక తాను ఎంతో మంది టెక్నీషియన్స్ ను అలాగే ఆర్టిస్టులను పరిచయం చేసినా వాళ్లెవరూ తనకు సహాయం చేయలేదని ఇండస్ట్రీలో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే చందంగా ఉంటారంటూ తెలిపారు. నష్టపోయిన ప్రతిసారి తానే లేచి నిలబడినట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…