Sonia Aggarwal: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవడం సర్వసాధారణం అయితే టాలెంట్ ఉండి ఆ టాలెంట్ కు అనుగుణంగా అందం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు చాలా తొందరగా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నటి సోనియా అగర్వాల్ ఒకరు.
ఈమె నీ ప్రేమకై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ధమ్ సినిమా ద్వారా జగపతిబాబుతో కలిసి సందడి చేశారు ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే 2004వ సంవత్సరంలో 7/G బృందావన కాలనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాలో ఈమె నటనకు ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. ఇలా నటిగా తనని నిరూపించుకున్నటువంటి సోనియా అగర్వాల్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక చాలా తొందరగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఈమె దర్శకుడు సెల్వ రాఘవన్ అనే అతని వివాహం చేసుకోవడం తనతో విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది.
ఇలా తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈమె ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె స్లీవ్ లెస్ డ్రెస్సులు ధరించి తన అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో నాలుగు పదుల వయసులో కూడా ఈ గ్లామర్ షో అవసరమా అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…