ప్రస్తుతం సోషల్ మీడియాలో, అన్నీ ఇండస్ట్రీలలో ఎక్కడ చూసినా కూడా పునీత్ మరణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు సోషల్ మీడియాలో వేదికగా పునీత్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అతడి మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అతడి మరణవార్త విని చాలా మంది షాక్ కు గురయ్యారు. అయితే అప్పటివరకూ బాగానే ఉన్నా పునీత్ ఒక్కసారిగా ఆస్పత్రి పాలవ్వడం ఆ తర్వాత మరణించడం అన్నది ఇప్పటికి కూడా షాకింగ్ గానే ఉంది.
పునీత్ ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నుండి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఏంటి అంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికే ఇతడి మరణవార్త పై పలువురు సినీ ప్రముఖులు పునీత్ తో ఉన్న వారి అనుబంధం గురించి బయట పెడుతున్నారు.తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
పునీత్ మరణవార్త విన్న ఆర్జీవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.పునీత్ రాజ్ హఠాన్మరణ వార్త షాకింగ్‌కి గురి చేసింది. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మన కళ్లు తెరిపించే భయంకరమైన నిజం ఎవరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి జీవితాన్ని బతికుండగానే సంతోషంగా గడిపేయాలి’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రతీ అంశంలో కాంట్రవర్సీ వెతికే వర్మ పునీత్ మరణం విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడంతో నెటిజన్లు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.
శుక్రవారం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్‌కు తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…