అదే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘అమృత ప్రణయ్’ ల ప్రేమ ఆపై అమృత తండ్రి కిరాయి గుండాలతో ప్రణయ్ ప్రాణాలు తీయించిన సంఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మ ర్డ ర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల కూడా చేశారు. అయితే దీనిపై ప్రణయ్ భార్య అమృత ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.. అయితే అమృత మాటలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు డైరెకర్ రామ్ గోపాల్ వర్మ.
‘అమృత పేరుతో వచ్చిన ఒక పోస్ట్‌పై నేను రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నా. ఆ పోస్ట్ ఆమె రాసిందో లేకపోతే ఎవరైనా పనిలేని వాళ్ళు రాశారో నాకు తెలియదు కానీ.. నేను తీయబోయే ‘మ ర్డ ర్’ సినిమాలో నేను ఏమి చూపించాలను కుంటున్నానో అన్న ఆందోళన నెలకొని ఉన్న ఈ సమయంలో దానిపై స్పందించడం నా బాధ్యత. ‘మ ర్డ ర్‘ పోస్టర్లో ఈ సినిమా యదార్ధ గాథ ఆధారంగా అని ప్రకటించాము ఆంతే తప్ప, సినిమాలో వాస్తవాలే ఉంటాయని నేను చెప్పలేదు. ఈ కథకు అసలు ఎక్కడ మొదలైందో ప్రజలకు అందరికి ఎప్పటినుంచో తెలుసు. ఈ పోస్టర్ చేయడం కోసం ప్రేరణ ఇచ్చిన రియల్ ఫోటోలు ఇంటర్నెట్లో చాలానే ఉన్నాయి. ఇక్కడ నేనేం దొంగతనం చేయలేదు.
ఈ మూవీ కథ ఇదేనని ఎవరు ఎన్ని అనుకున్నా కానీ, నా ఆలోచన మాత్రం వేరు. ఈ సినిమా విడుదల తరువాతే అదేంటో అందరికి తెలుస్తుంది. అంతేగాని ఇలా ముందుగానే ఊహించుకునేవారికి పరిపక్వత లేదని నేను భావిస్తున్నాను.. నా సొంత ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. దీనిపై ఎవరేమనుకున్నా నా చివరి మెసేజ్ మాత్రం ఇదే. ఎంతో వేదనను అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం, సానుభూతి ఉన్నాయి. అందువల్ల ఈ ‘మ ర్డ ర్‘ చిత్రం ఎవరినీ అగౌరవించదు..’ అని వర్మ హామీ ఇచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…