ఇటీవలే చైనా సేనలతో వీరోచితంగా పోరాడి నేలకొరిగిన కల్నల్ సంతోష్ కుమార్ కుటుంబాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ సూర్యాపేట లోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంలో సంతోష్ బాబు తల్లిదండ్రులకు ఒక కోటి రూపాయాలు, ఆయన భార్యకు 4 కోట్లు రూపాయిల చెక్ అందజేశారు. అదే సమయంలో సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా సీఎం అందించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ పట్టా అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీవ్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన తరువాత సీఎం మీడియాతో మాట్లాడుతూ… ‘సంతోష్ బాబు దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ధారపోశారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది…’ అని అన్నారు. కాగా, చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు మరణించిన 19 మంది జవాన్ల కుటుంబ సభ్యులకు కూడా రూ.10 లక్షల చొప్పున సాయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…