Categories: FeaturedMovie News

సుశాంత్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్… ఆ ఇద్దరి ఎఫైర్ వల్లే సుశాంత్ వేదింపులకు గురై తనువు చాలించాడా?

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం వెనుక అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తమ అభిమాన హీరో మరణించిన వార్తను సుశాంత్ ఫ్యాన్స్ జీర్ణించుకో లేకపోతున్నారు. ఏఐఈఈఈ టాపర్, మరియు ప్రొఫెషనల్ గా, ఫైనాన్సియల్ గా ఎంటువంటి ఇబ్బందులు లేని వాడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ హీరో అంత పిరికివాడు కాదు అంటూ వాపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పక్కా ప్లాన్‌తో సుశాంత్ ను హతమార్చారని కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు.

ఇక ఈ వ్యవహారం అంతా బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ నడిపించాడంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాక తాజాగా ముంబై పోలీసులు రియా చక్రవర్తిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులకు హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పే పొంతలేని వ్యాఖ్యలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ సమయంలో ఆమె సుశాంత్ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంటూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ‘సుశాంత్ ఇంట్లో దయ్యం ఉందని.. అతడితో కలిసి ఉన్నప్పుడు యేవో శక్తులు ఉన్నట్లుగా అనిపించిందని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా సుశాంత్ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కాంట్రాక్టులు కూడా రద్దు చేసుకున్నాడని.. ఆ బ్యానర్‌లో తనను కూడా సినిమాలు చేయవద్దని సుశాంత్ చెప్పినట్లుగా రియా వివరించింది.

మరోవైపు సుశాంత్‌కు కొన్నాళ్లుగా చికిత్స అందించిన మానసిక వైద్యుడు కేసరి చావ్డాని పోలీసులు విచారించిన సమయంలో అయన కొన్ని సంచలన విషయాలు తెలిపాడు.. “సుశాంత్ గత కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడిపాడని.. అంతేకాకుండా ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనతో కూడా సుశాంత్ చాలా ఇబ్బందులు పడేవాడని పోలీసుల విచారణలో డాక్టర్ కేసరి చావ్డాని తెలిపారని సమాచారం.. దీనితో మహేష్ భట్, రియా చక్రవర్తిల మధ్య ఎఫైర్ ఉందని, అందువల్లనే.. వాళ్ళు సుశాంత్ ను తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అయన బలవన్మరణానికి పాల్పడ్డాడని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago