Categories: FeaturedMovie News

అదిరింది షోలో చమ్మక్ చంద్ర రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నిజంగానే అదిరిపోతారు !

జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ చేరువైన ఆర్టిస్ట్ లలో చమ్మక్ చంద్ర ఒకడు. కుటుంబ గాథల నేపథ్యంలో అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్రను ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో తెలియచెబుతూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాడు. అందుకే జబర్దస్త్ షో లో చంద్ర స్క్రిట్ కి మంచి రేటింగ్ ఉంది. అసలు ఈ చంద్ర ఎవరు.? ఎక్కడినుండి వచ్చాడు.? అతని కుటుంబ వివరాలేంటి.? ఎంతవరకు చదుకున్నాడు.? మొదలైన వివరాలేమీ ఎవరికీ మందికి తెలీదు. ప్రస్తుతం ఏసి కార్ లో తిరుగుతున్న చంద్ర ఒకప్పుడు హైదరాబాద్ లో కూలి పని చేసేవాడంటే నమ్మశక్యంగా లేదు కదూ..!

కానీ ఇది నిజం. మనందరికీ తెలిసిన జబర్దస్త్ చంద్ర బుల్లితెరకు పరిచయం కాకముందు కూలి పని చేస్తూ ఓకే పూట అన్నం తిని 2పూటల పస్తుండే వాడు. ఇక చంద్ర కుటుంబ పరిస్థితి తెలిస్తే ఈ ఆర్టికల్ ను చదివినవాళ్ళెవరికైనా వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లుతాయి. మనసు చలిస్తుంది. చంద్ర చాల పేద కుటుంబంలో జన్మించాడు. ఎంత పేదరికం అంటే చంద్ర తల్లి గారు తననీ, తన తమ్ముడిని చిన్నతనంలోనే ఎత్తుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మిషన్ కుట్టి కొంత డబ్బు సంపాదిస్తుండేది. ఇక చంద్ర తండ్రి అయితే దాదాపు 12 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి కట్టెలు అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుతో అతి కష్టం మీద కుటుంబం నెట్టుకుంటూ వచ్చారు. అంతేకాక వీళ్ళకొక ఆవు ఉండేది. పాలను అమ్మి వచ్చే డబ్బుతో బియ్యం కొనేవారు. చంద్ర నిజామాబాద్ జిల్లా వెంకటాపురం తండాకు చెందినవాడు. ఇతను 10వ తరగతి వరకే చదువుకున్నాడు.

చిన్నప్పటినుండి సినిమాలు చూస్తూ పెరిగిన చంద్రకు కామెడీ అంటే ఎంతో ఇష్టం. మీరు మరీ ఆశ్చర్యపోయే విషమేమిటంటే చంద్ర లో చిన్న తనం నుండే కామెడీ లక్షణాలు ఉండటంతో తన చిలిపి చేష్టలతో స్నేహితులను కడుపుబ్బా నవ్వించేవాడట. ఆ చేష్టలకు ఇరుగుపొరుగు వారంతా నవ్వేవాళ్ళంట. చంద్ర నువ్వు తలుచుకుంటే జీవితంలో గొప్ప హాస్య నటుడు అవతావని అంటూ ఉండేవారు. అలా స్నేహితులు, సన్నిహితులు ప్రోత్సాహిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు విన్న చంద్ర ఎలాగైనా మంచి హాస్య నటుడు కావాలని నిశ్చయించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనను తాను నిరూపించుకోడానికి వూర్లో పెళ్ళిళ్ళు జరిగే చోట స్టేజి మీద పాటలు పడుతూ, జోకులు వేస్తూ జనాలని నవ్వించేవాడు. చంద్రకు ఇద్దరు సోదరులు. వీళ్ళు ఊర్లోనే వ్యవసాయం చేస్తుండేవారు. కానీ చంద్ర మాత్రం ఎలాగైనా సినిమా రంగంలో రాణించి తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే తపనతో హైదరాబాద్ వచ్చేశాడు.

కానీ బ్రతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన చంద్రకు అసలు ఏమి తెలీదు. సినిమాల్లోకి ఎలా వెళ్లాలో.. ఎవరిని కలవాలో ఏమి తెలియని పరిస్థితి. హైదరాబాద్ లో పూట గడవాలన్నా.. రూమ్ లో ఉండాలన్నా చేతిలో ఎంతోకొంత డబ్బుండాలి.10వ తరగతి చదివిన చంద్రకి ఎక్కడ ఉద్యోగం రాలేదు. అయినాసరే ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లితీరాలనే పట్టుదలతో బతుకు తెరువు కోసం ఒకపక్క కూలి పని చేస్తూ మరోపక్క సినిమాలో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తుండేవాడు. కూలి పని చేస్తూ వచ్చిన డబ్బుతో కేవలం ఒక్కపూట మాత్రమే అన్నం తిని 2 పూటలా పస్తులుండి ఖర్చులకి పోగా మిగిలిన డబ్బును ఇంటికి పంపేవాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రకి కలిసొచ్చిన అదృష్టం పేరు ‘జబర్దస్త్’. తన మొదటి షో లోనే లేడీ గెట్ అప్ వేసిన చంద్ర తన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించడమే కాకుండా జబర్దస్త్ లో ఒక బ్రాండ్ గా మారిపోయాడు. చంద్ర స్క్రిట్ వచ్చిందంటే చాలు ప్రారంభం నుండి చివరిదాకా నవ్వాల్సిందే. జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్న చంద్రను చూసి తన తల్లీదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. ఒక్కపుడు అష్ట కష్ఠాలన్నీ అనుభవించిన చంద్ర ఇప్పుడెలా ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం జబర్దస్త్ షోకి రెమ్యునరేషన్ గా చంద్ర ఒక్క ఎపిసోడ్ కి లక్ష యాబై వేలు తీసుకుంటున్నాడు.

ఐతే ఈ సక్సెస్ అంతే ఈజీగా రాలేదు చంద్రకి. జబర్దస్త్ లో అవకాశం రావడానికి 13 ఏళ్ళు పట్టింది. బుల్లితెర పై కూడా తెలుగు ఛానెల్స్ మధ్య పోటీ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో సడెన్ గా జబర్దస్త్ ను వదిలేసి అదిరింది షోకు వచ్చేశాడు చంద్ర. జబర్దస్త్ షోలో అంతటి క్రేజ్ ఉన్న ఈ కమెడియన్‌ను ఓ షో నుంచి మాన్పించి మరో షోలో నటించేలా చేయాలంటే భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి. ప్రస్తుతం అదిరింది షో కూడా ఐదే జరిగింది. జబర్దస్త్ నుంచి తన కేరాఫ్ అడ్రస్ అదిరిందికి మార్చుకోడానికి చంద్ర ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలా నెలకు 4 కాల్షీట్స్ ఉండేవని..

అలాంటిది ఇప్పుడు జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తాజా సమాచారం. అంటే దాదాపు జబర్ధస్త్‌కు డబుల్ అన్నమాట. ప్రస్తుతం వస్తున్న అదిరిందిలో చమ్మక్ చంద్ర హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మొత్తమ్మీద ఛానెల్ మారడానికి చాలా ఆలోచించానని.. మంచి కార్యక్రమం కాబట్టే ధైర్యం చేసానని చెబుతున్నాడు చంద్ర. కష్టేఫలిః అన్నట్టుగా ఒకప్పుడు చంద్ర పడిన కష్టాలకి ఫలితమే ఈ రోజు అతడిని విజయ తీరాలకు చేర్చిందని చెప్పవచ్చు. రియల్లీ హాట్సాఫ్ టూ చమ్మక్ చంద్ర.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago