Categories: FeaturedMovie News

స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న అగ్ర హీరోల కూతుర్లు !!

సాధారణంగా బాగా పాపులరైన హీరోల కొడుకులు తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో హీరోలుగా మారుతుంటారు. వీరిలో కొందరు సక్సెస్ ను సాధిస్తే.. మరికొందరు ఏదో సరదాగా అలా ఎంట్రీ ఇచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కూతుళ్లు కూడా నవతరం హీరోలకు గట్టి పోటీనిస్తూ అటు టాలీవుడ్ లోనూ.. ఇటు బాలీవుడ్ లోనూ తమ తండ్రుల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా కధానాయికల హవా నడుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్‌ను షేక్‌ చేసిన పాపులర్‌ హీరోల కూతుళ్లు ప్రస్తుతం వెండితెరపై స్టార్ హీరోయిన్లగా రాణిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా..

బాలీవుడ్‌ అంటే కపూర్‌ ఫ్యామిలీయే గుర్తొస్తుంది. రణధీర్‌ కపూర్‌కు ఇద్దరు కూతుర్లు. వాళ్ళే కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌. ఇద్దరూ బాలీవుడ్ లోకి హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇచ్చారు. కొన్నాళ్లు వెండితెరపై హీరోయిన్‌గా దూసుకుపోయిన కరిష్మా పెళ్లి తర్వాత బాలీవుడ్ కి దూరమైపోయింది. ఇక రణధీర్‌ కపూర్‌ రెండో కూతురు కరీనా కపూర్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా హల్‌చల్‌ చేస్తోంది. తన తండ్రి రణధీర్‌ కపూర్‌ వారసత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది.

బాలీవుడ్‌ హీరో శతృఘ్న సిన్హాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. కొడుకులిద్దరూ సినిమా రంగంలోకి రాలేదు. కూతురు సోనాక్షి సిన్హా మాత్రం ‘దబాంగ్‌’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా అటు స్టార్‌ హీరోలు మెచ్చిన కథానాయికగా, ఇటు అత్యధిక అభిమానుల్నీ సంపాదించుకున్న అగ్ర కధానాయికగా బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలందుకుంటుంది. అలా తన తండ్రి శతృఘ్న వారసత్వాన్ని కొనసాగిస్తోంది సోనాక్షి.

బాలీవుడ్ లో ఆ తర్వాత చెప్పుకోదగిన హీరో అనిల్‌ కపూర్‌. ఇతనికీ ఇద్దరు కూతుళ్లుండగా పెద్ద కూతురు సోనమ్‌ కపూర్‌ ప్రస్తుతం కథానాయికగా రాణిస్తోంది.

బాలీవుడ్‌ తెరపై గత 30 ఏళ్ళుగా విలనిజం పండించిన శక్తి కపూర్‌కు ఒక కొడుకు, ఒక కూతురు. శక్తి కపూర్‌ కొడుకు సిద్ధార్ధ్‌ కంటే కూతురు శ్రద్ధా కపూర్‌ పాపులరైన సంగతి తెలిసిందే. ‘ఆషికీ 2’ తో బాగా పాపులరైన శ్రద్ధా కపూర్‌ బాలీవుడ్‌లోనే పాపులర్‌ యంగ్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది.

ఏ బాషలోనైనా ఆవలీలగా నటించగల యూనివర్శిల్ హీరో కమల్‌ హాసన్‌ కు ఇద్దరు కూతుళ్లు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం కథానాయికలుగా బాగా పాపులరయ్యారు. మొదటి కూతురు శృతిహాసన్‌ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలు చేసి అందర్నీ మెప్పిస్తుంటే.. రెండో కూతురు అక్షర ‘షమితాబ్‌’ మూవీతో బాలీవుడ్‌కు పరిచయమై తొలి మూవీతోనే నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డ్రీమ్‌గాళ్‌ హేమమాలిని- ధర్మేంద్రల ముద్దుల కూతురు ఇషా డియోల్‌ హీరోయిన్‌గా పాతిక చిత్రాల దాకా నటించింది. పెళ్లయ్యాక ఇషా కూడా షరా మామూలే అన్నట్టు బాలీవుడ్ కు దూరమైంది.

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురు అతియా శెట్టి ఈమధ్య కాలంలోనే ‘హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌ హీరోయిన్‌గా రాణించి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించటానికి అతియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

బాలీవుడ్‌ హాస్య నటుడు గోవిందా కూతురు టినా ఇటీవలే ‘సెకండ్‌ హ్యాండ్‌ హజ్బెండ్‌’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

అలాగే శ్రీదేవి కూతుర్లు జాన్వీ ఆల్ రెడీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ బాటలో పయనిస్తుండగా.. రెండో కూతురు ఖుషీ కూడా భవిష్యత్తులో హీరోయిన్ గా వెండితెరపైకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది.

ఇక తండ్రుల బ్యాక్ గ్రౌండ్ ద్వారా అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ లోనూ హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన ఆ నటీమణులు ఎవరో మీరే చదవండి..????

మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం మొదలైన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

యాంగ్రీ యంగ్ స్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక.. గతేడాది విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా హీరోయిన్ గా ‘గుండెల్లో గోదారి’ ‘దొంగాట’ వంటి చిత్రాల్లో నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది.

సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు మంజుల కూడా ‘షో’ ‘ఆరెంజ్’ ‘కావ్యాస్ డైరీ’ వంటి సినిమాల్లో నటించింది.

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యా కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విశాల్ సినిమా ‘పట్టతు యానై’ అనే చిత్రంలో నటించింది.

ఒకప్పుడు తమిళ సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ కుమార్ ముగ్గురు కూతుర్లు వనిత ‘దేవి’ చిత్రంలో, ప్రీతి ‘రుక్మిణి’ చిత్రంలో , శ్రీదేవి ‘ఈశ్వర్’ చిత్రంలో నటించారు.

మరో తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా రాణిస్తుంది.

ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా పరిచయమైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.

ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన కూడా ‘పిచ్చిగా నచ్చావ్’ అనే చిత్రంలో నటించింది.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్.. ఇలా స్టార్ హీరోల వారసత్వాన్ని కూతుర్లే కొనసాగిస్తున్నారు. సెలబ్రిటీ డాటర్లకు ఎంత క్రేజ్‌ ఉందో ఇప్పుడైనా అర్ధమైంది కదా.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago