బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం వెనుక అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తమ అభిమాన హీరో మరణించిన వార్తను సుశాంత్ ఫ్యాన్స్ జీర్ణించుకో లేకపోతున్నారు. ఏఐఈఈఈ టాపర్, మరియు ప్రొఫెషనల్ గా, ఫైనాన్సియల్ గా ఎంటువంటి ఇబ్బందులు లేని వాడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ హీరో అంత పిరికివాడు కాదు అంటూ వాపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పక్కా ప్లాన్‌తో సుశాంత్ ను హతమార్చారని కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు.

ఇక ఈ వ్యవహారం అంతా బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ నడిపించాడంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాక తాజాగా ముంబై పోలీసులు రియా చక్రవర్తిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులకు హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పే పొంతలేని వ్యాఖ్యలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ సమయంలో ఆమె సుశాంత్ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంటూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ‘సుశాంత్ ఇంట్లో దయ్యం ఉందని.. అతడితో కలిసి ఉన్నప్పుడు యేవో శక్తులు ఉన్నట్లుగా అనిపించిందని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా సుశాంత్ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కాంట్రాక్టులు కూడా రద్దు చేసుకున్నాడని.. ఆ బ్యానర్‌లో తనను కూడా సినిమాలు చేయవద్దని సుశాంత్ చెప్పినట్లుగా రియా వివరించింది.

మరోవైపు సుశాంత్‌కు కొన్నాళ్లుగా చికిత్స అందించిన మానసిక వైద్యుడు కేసరి చావ్డాని పోలీసులు విచారించిన సమయంలో అయన కొన్ని సంచలన విషయాలు తెలిపాడు.. “సుశాంత్ గత కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడిపాడని.. అంతేకాకుండా ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనతో కూడా సుశాంత్ చాలా ఇబ్బందులు పడేవాడని పోలీసుల విచారణలో డాక్టర్ కేసరి చావ్డాని తెలిపారని సమాచారం.. దీనితో మహేష్ భట్, రియా చక్రవర్తిల మధ్య ఎఫైర్ ఉందని, అందువల్లనే.. వాళ్ళు సుశాంత్ ను తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అయన బలవన్మరణానికి పాల్పడ్డాడని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.



























