Director Sagar : సీనియర్ దర్శకులు విద్యా సాగర్ రెడ్డి అందరికీ డైరెక్టర్ సాగర్ గా బాగా సుపరిచితులు. మొదట ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసి ఆ తరువాత దర్శకత్వంలోకి వచ్చిన ఈయన కృష్ణ గారితో మొదట సినిమా తీయాలని అనుకునేవారట. దాదాపు పది సంవత్సరాల పైనే సహాయ దర్శకుడిగానే పనిచేసారు. దర్శకుడిగా మంచి హిట్లందుకున్న ఈయన నిర్మాతగా సినిమా తీసి భారీ నష్టాలను చూసారు. ఇక సినిమాలను తీయకూడదని నిర్ణయించుకుని అస్త్ర సన్యాసం చేసారు.
సావిత్రి ని మోసం చేసింది వాడే…
డైరెక్టర్ సాగర్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ దీప కు నేనంటే చాలా ఇష్టమని, నాకు పెళ్ళైన విషయం తనకు తెలియదని, నేను సినిమాలు కొంత అయ్యేవరకు ఆమెకు చెప్పలేదని అయితే ఆమె మేనేజర్ గా ఉంటూ ఆమె డేట్స్ చూసేవాడిని అంటూ తెలిపారు. ఏ సినిమా అయినా నన్ను అడిగి డేట్స్ ఇచ్చేదంటూ తెలిపారు. ఇక మహానటి సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమె తప్పు చేయలేదంటూ చెప్పారు. ఆమె తప్పు చేయలేదని కాకపోతే నమ్మిన వాడు బాగా మోసం చేశాడంటూ తెలిపారు.
ఆమె ప్రభుత్వం అడిగిందని ఆమె బంగారం ఆంతా ఇచ్చేసిన వ్యక్తి, అలాంటి ఆమెను మోసం చేసిన వ్యక్తి నాకు బాగా తెలుసు అంటూ చెప్పారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సావిత్రి ఇంటి గూర్ఖా వద్ద ఉంటూ సావిత్రి గారి కంట్లో పడి అలా పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె అప్పటికే డిప్రెషన్ లో తాగుడుకు బానిస కాగా ఆమె ఆర్థిక వ్యవహారలాన్నిచూసే బాబు అనే వ్యక్తి ఆమెను ఎక్కువగా తాగనిచ్చేవాడు కాదు. అయితే సుబ్రహ్మణ్యం మెల్లగా ఆమె పంచన చేరి ఆమెతో కలిసి తాగి ఆమెను మరింత తాగేలా చేసి మత్తులో ఉన్నపుడు ఆస్తుల మీద సంతకాలు చేయించుకున్నాడు. అలా ఆమె చివరికి డబ్బు లేకుండా ఒంటరిగా మరణించారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…