Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ బేబీ సినిమా సక్సెస్ మీట్ లో ఒక హీరో తన సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని, అవమానించాడు అంటూ మాట్లాడటం బాగా వైరల్ అయింది. ఇక ఆ హీరో విశ్వక్ సేన్ కావడం తాను కూడా వివరణ ఇవ్వడం ఇవన్నీ జరిగిపోగా అసలు మ్యాటర్గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయి రాజేష్ క్లారిటీ ఇచ్చారు.
విశ్వక్ కి తెలియని విషయం ఏంటంటే…
డైరెక్టర్ సాయి రాజేష్ కథ వినకుండానే ఒక హీరో తనతో సినిమా చేయడానికి నో చెప్పాడని బేబీ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు. అయితే ఆ హీరో ఎవరన్నది చెప్పలేదు. అయితే ఇటీవల విశ్వక్ ఒక సినిమా మీట్ లో మాట్లాడుతూ తన గురించి ఇలా ఒక డైరెక్టర్ మాట్లాడటం బాగోలేదని, ఒక సినిమా చేయనని చెప్పే హక్కు నాకు ఉంటుందంటూ మాట్లాడాడు. ఇక ఈ విషయం గురించి సాయి రాజేష్ మాట్లాడుతూ తనసలు విశ్వక్ పేరు చెప్పలేదని తానే రివీల్ చేసుకున్నాడని, కథ విన్నాక నో చెప్పుంటే నేను ఫీల్ అయ్యేవాడిని కాదు కానీ అక్కడ జరిగింది వేరు అంటూ ఇక ఈ విషయం నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు, వివాదాలకు ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు అంటూ చెప్పారు.
అయితే విశ్వక్ నో ఎలా చెప్పడన్నది మధ్యలో చెప్పిన వాళ్ళు పాలిష్ చేసి చెప్పుంటే బాగుండేది, ఎలా అన్నాడో అలానే చెప్పేసరికి బాధగా అనిపించింది. కానీ విశ్వక్ కి తెలియని విషయం ఏంటంటే తన మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ సినిమా విడుదల సమయంలో నేను హెల్ప్ చేశాను. సినిమా ట్రయిలర్ చూసి నచ్చడంతో సినిమాను గీతా ఆర్ట్స్ వాళ్లకు ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ కి చూపించి సినిమా విడుదల అయ్యేందుకు నేను, మరో వ్యక్తి హెల్ప్ చేసాం. అందుకే సినిమా మొదట్లో థాంక్స్ అంటూ మా పేర్లు ఉంటాయి ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదంటూ సాయి రాజేష్ తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…