Categories: FeaturedMovie News

Director Sai Rajesh : సంపూర్ణేశ్ బాబు ఒక షాప్ లో 750 రూపాయలకు పనిచేసేవాడు… నా సినిమాలో చేస్తావా అని అడిగితే ఎమన్నాడంటే…: డైరెక్టర్ సాయి రాజేష్

Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ తన కెరీర్ విశేషాలను అవమానాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సంపూర్ణేశ్ బాబును చూడగానే పడిపోయా…

సినిమా మొదట ఎక్కువ బడ్జెట్ లేకుండా ఒక ఐదు థియేటర్స్ లో విడుదల చేయాలి, యూట్యూబ్ లో విడుదల చేస్తే మంచి వ్యూస్ వచ్చి పెట్టిన డబ్బు వెనక్కి వస్తే చాలని ‘హృదయ కాలేయం’ సినిమాను ప్లాన్ చేశామని సాయి రాజేష్ తెలిపారు. అలా షూటింగ్స్ దగ్గర సంపూర్ణేశ్ ను చూసి మొదటి సారి చుసినపుడే పడిపోయాను, ఇక తనని పెట్టి సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. తన ఫోటోలు అందరికీ ఇచ్చి అవకాశాలు ఇవ్వాలని అడిగేవాడు.

అప్పట్లో హీరో ఉపేంద్ర స్టైల్ మైంటైన్ చేస్తూ చాలా వింతగా ఉండేవాడు. సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగితే అప్పటికే అవకాశాల కోసం డబ్బు పోగొట్టుకున్న సంపూ నేను డబ్బు ఇవ్వలేనని చెప్పాడు. నేనే ఇస్తాను నా సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగాను. అలా హృదయ కాలేయం సినిమా చేసాం. అయితే సినిమా అయ్యాక నిన్ను చాలామంది తిడతారు అని చెబితే అవన్నీ నేనేం పట్టించుకోను సినిమా అయ్యాక నాకో సిడి ఇవ్వండి చాలని చెప్పాడు. ఆ సినిమా కోసం పేరు సంపూర్ణేశ్ బాబు గా మార్చాము తన అసలు పేరు నరసింహ చారి. ఒక గోల్డ్ షాప్ లో 750 రూపాయలకు పనిచేసేవాడు అంటూ సాయి రాజేష్ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago