‘విరుమాన్’ సినిమాతో తమిళ చిత్రంలో నటిగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్.. తాను ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయినట్లు ప్రకటించింది. తన సోషల్ మీడియా ఖాతాలో తాను డిగ్రీని అందుకుంటూ.. తండ్రితో డిగ్రీ పట్టుకుని ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు ఈ యువ నటి.
ఈనేపథ్యంలో ఆమె ట్విట్టర్ ఇలా ట్యాగ్ చేశారు.. ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్ర లేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగించడంతో.. అదితిని మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కంగ్రాట్యులేషన్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
ఇక ఆమె కథానాయికగా పరిచయం కానున్న ‘విరుమాన్’ లో నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. నటీనటులు సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. గతంలో కార్తీ హీరోగా ‘కొంబన్’ చిత్రాన్ని తెరకెక్కించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీ , అదితి శంకర్ తో పాటు విరుమాన్, రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శంకర్ కు ఇద్దరు కూతుళ్లు.. పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇటీవల ఓ క్రికెటర్ ను వివాహం ఆడిన విషయం తెలిసిందే. ఇక రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…