Featured

కవలపిల్లలకు జన్మనిచ్చిన లోబో భార్య.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..!

లోబోగా ప్రసిద్ధి చెందిన మహమ్మద్ ఖయ్యూమ్.. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న యాంకర్ గా.. నటుడిగా అందరికీ తెలిసిందే. లోబో తన అసాధారణ డ్రెస్సింగ్ , మేకప్‌కు ప్రసిద్ధి చెందాడు. అంతే కాకుండా అనేక టీవీ షోలలో కనిపించాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్‌లలో అతను కూడా ఒకడు .

అతను ప్రేక్షకులను డీసెంట్‌గా అలరించాడు.. హౌజ్ లో ఉన్నన్నీ రోజుల ప్రేక్షకులనూ బాగానే నవ్వించినా.. రియాలిటీ షో నుండి ముందుగానే బయటకు వచ్చాడు. అతడు కొన్ని సందర్భాల్లో తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన భార్య గర్భవతి అని.. ఈ సమయంలో తాను ఆమె పక్కన ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు ఎక్కువగా బాధ పడలేదు. కానీ.. తన భార్య వద్దకు వెళ్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. లోబో భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.
లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు.. అతడే ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోబో కొన్ని సినిమాల్లో నటించాడు. అతను నాని నటించిన పైసాలో కనిపించాడు.. ఈ సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకరి పాత్రను పోషించాడు. లోబో హైదరాబాద్‌లో టాటూ పార్లర్‌ని నడిపిస్తున్నాడు. అంతే కాకుండా అతడు జీవనాధారంగా ఓ షాప్ ను కూడా నడిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోబోకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్ లో నటిస్తున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వాటర్ ఫాస్టింగ్ లాభాలా? ప్రమాదాలా? నిపుణుల వివరణ!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…

18 minutes ago

ముంబై ఓటములకు హార్దిక్ కారణమా? కెప్టెన్సీపై భారీ విమర్శలు

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…

43 minutes ago

చిన్నారుల్లో పెరుగుతున్న SMA… రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఎందుకు అవసరం?

ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

48 minutes ago

యోగా గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? నిపుణుల హెచ్చరిక!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…

1 hour ago

15 ఏళ్లుగా సమోసాలకు దూరం.. అక్షయ్ సీక్రెట్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…

2 hours ago

“లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది – హీరోయిన్ అనన్య నాగళ్ల

అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…

2 hours ago