మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా పూర్తి చేసుకొని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ భారీగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభించబోతుందని గతంలో చిత్ర బృందం వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 11 నుంచి షూటింగ్ పనులు ప్రారంభించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇక్కడ కాకుండా.. పూణేలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడు భాషలలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ జోడీ కట్టనున్నారు. ఇకపోతే చెర్రీ, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా.. ఇందులో చెర్రీ ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది.
అక్టోబర్ 11 నుంచి ఈ సినిమా వరుస షూటింగ్ ను జరుపుకొనుంది. అయితే ఎక్కువగా ఈ సినిమాను తెలంగాణ పరిసర ప్రాంతాలలో పూర్తి చేయాలని దర్శకుడు సినిమా లొకేషన్లో కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పనులను పూర్తిచేసుకుని త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…