General News

మనిషిపై పగబట్టిన కోతి.. 22 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరీ..!

కోతుల గుంపు ఒక్కసారిగా మనుషులకు కనిపించాయంటే అటు వైపు వెళ్లడానికి చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కోతులకు తినడానికి ఏమైనా దొరికిందంటే.. ఎగిరి గంతేస్తుంది. అంతే కాదు చిలిపి చేష్టలు కూడా చేస్తుంది. కోతికి ఆ పేరు కూడా ఉందన్న విషయం తెలిసిందే. సాధారణంగా కోతుల ఐక్యమత్యంగా ఉంటాయట. వాటిలో దేనికైనా ఏమైనా అయిందంటే.. ఒక్కసారిగా మీద పడతాయి.

అంతేకాదు తోటి కోతి చనిపోయిందంటే.. దాని దేహం వద్దకు వచ్చి మరీ బాధపడుతుంటాయి. మిగతా జంతువులకు కోతులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే.. మనిషి ఆకృతి రావడానికి మూలం కోతి అని మన పూర్వికులు చెబుతుంటారు. ఇదంతా ఇలా ఉంటే.. ఒక కోతి ఓ వ్యక్తి పాలిట శాపంగా మారింది. అసలేమైందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహారా గ్రామంలో ఒక పాఠశాల వద్ద ఓ కోతి అక్కడ ఉన్న విద్యార్థులను.. స్థానికంగా ఉండే వారిని కూడా తెగ ఇబ్బంది పెట్టేసిందట.

దాని దాటికి తట్టుకోలేక అక్కడే ఉన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. దానిని పట్టుకునేందుకు కొంత మందిని పంపారు అధికారులు. అక్కడ వారు కోతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక ఆటో డ్రైవర్ జగదీశ్ వాళ్లకు సహకరించాడు. దానిని గమనించి కోతి అతడిపై దాడికి యత్నిస్తుండగా.. తన ఆటోలోనే దాక్కున్నాడు.

అయినా ఆ కోతి అతడిని వదిలి పెట్టలేదు.. ఆటో పైకి ఎక్కి టాప్ ను మొత్తం చించేసింది. ఎట్టకేలకు దానిని పట్టుకొని.. 22 కిలోమీటర్ల దూరంలో వదిలి పెట్టి వచ్చారు. మళ్లీ ఆ కోతి ఓ లారీ ఎక్కి అదే గ్రామానికి వచ్చి జగదీశ్ పై పగబట్టి అతడిపై దాడి చేసింది. దీంతో అతడు 8 రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. చివరకు మళ్లీ అధికారులు ఆకోతిని పట్టుకొని బంధించారు. అప్పుడు జగదీశ్ బతుకు జీవుడా అనుకుంటూ ఆటో నడపుకుంటున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago