Categories: FeaturedGeneral News

పట్టు వస్త్రాలు మన్నికగా ఉండాలంటే… ఇలా చేయండి!

మహిళలు పట్టు చీరలు కట్టేటప్పుడు కేవలం ఫంక్షన్లు, పెళ్లిళ్లకు మాత్రమే ధరిస్తారు. తర్వాత వాటిని భద్రంగా బీరువాలో దాచిపెడతారు. అయితే నెల రోజులకు ఒకసారి బయటకు తీసి.. ఫంక్షన్లకు వాడి.. మళ్లీ బీరువాలో పెడితే బాగానే ఉంటాయి.. కానీ సంవత్సరాల తరబడి నిల్వ ఉంచితె మాత్రం కొద్దిగా చెడిపోతాయి.

ఇలా ఎన్ని రోజులు ఉన్నా మన్నికగా ఉండాలన్నా.. కొత్తగా కనిపించాలన్నా ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా ఆ దుస్తులను వాడినప్పుడు ఎప్పుడైనా మృదువైన నీటితోనే ఉతకాలి. అందులో కొద్దిగా బొరాక్స్ పౌడర్ ను కలిపి ఉతికితే మన్నికగా ఉంటాయి. తర్వాత వాటిని ఆరేసినప్పుడు ఎండలో ఆరేయకూడదు.. కేవలం వాటిని నీడలోనే ఆరేయాలి.

పట్టు వస్త్రాలపై ఒకవేళ రక్తపు మరకలు ఉంటే.. ఉతికే టైంలో కొన్ని అమ్మోనియా చుక్కలు వేసి జాడించాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ అంటే చాలా ఇష్టపడతారు. అయితే ఒక్కో టైంలో వాళ్లను ఓదార్చి ఎత్తుకునే టైంలో చీరలకు ఆ మరకలు అంటుతాయి. అటువంటి మరకలను తొలగించాలంటే మాత్రం.. తప్పని సరిగా వాటిని వేడి నీటిలో ఉతికి ఆరేయాలి. కాఫీ లేదా టీ మరకలు లాంటివి తొలగించాలంటే.. దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి వేడినీటిలో ఉతకాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే.. ఏమైనా గాయాలు అయితే వాటి మీద పూసి.. వైద్యుల శుభ్రం చేస్తారు. కానీ దానిని ఈ రకంగా కూడా ఉపయోగించవచ్చు. మద్యం మరకలు అంటే వైన్, విస్కీ లాంటివి పోవాలంటే మాత్రం చల్లటి నీటిలో జాడించి.. వేడినీటిలో ఉతకాలి. ఇలా ఉతికిన తర్వాత పట్టు చీరలను లేదా వస్త్రాలను చెక్కల మీద, ప్లాస్టిక్ సంచుల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. వాటికి గాలి తగిలే విధంగా చూడాలి. అప్పుడే అవి చాలాకాలం ఉంటాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago