Director Teja : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి రాత్, గులాం తదితర హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అవార్డ్స్ కూడా అందుకున్నారు. తరువాత సినిమా డైరెక్టర్ అయిన తేజ చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన సినిమాల్లో హీరోల దగ్గరి నుండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరినీ ఆడిషన్ చేసి ఆయనే స్వయంగా ఎంపిక చేస్తారు. చాలా రోజుల గ్యాప్ తరువాత డైరెక్టర్ తేజ ‘అహింస’ అనే సినిమాతో మళ్ళీ వస్తున్నాడు. కొత్తవాళ్ళను ఎక్కువగా ప్రోత్సహించే తేజ మరోసారి కొత్త హీరోతో వస్తున్నాడు. ఇక తన కెరీర్ లో ఎన్నో సార్లు తప్పు చేసానంటూ చెప్తున్న డైరెక్టర్ తేజ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు.
నేను సంపాదించాల్సింది చాలా ఉంది…
అహింస అనే కొత్త సినిమాను తీస్తున్న డైరెక్టర్ తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ అలాగే కెరీర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను ఇంతవరకు సంపాదించిన దాని గురించి మాట్లాడుతూ తాను డబ్బులలో ఆస్తిలో ఎదుగుదల చూడను అంటూ చెప్పారు.
రెమ్యూనరేషన్ చెప్పడం కంటే తన వల్ల ఎంత కొత్త మంది ఇండస్ట్రీకి వచ్చారు అన్నదాంట్లోనే నా విలువ చూసుకుంటాను అంటూ మాట్లాడారు. ఇప్పటికీ నా వల్ల కొన్ని వందల కుటుంబాలకు ఇండస్ట్రీలో పని వచ్చింది. అలా నేను పోయే లోపు పది వేల మందికి సినిమా ఇండస్ట్రీలో అవకాశం కల్పించాలనేది నా కోరిక, నేను సంపాదించాలనుకునేది అదే అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…