Director Teja: డైరెక్టర్ తేజ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈయన ఎప్పుడు తనకు తోచిన విషయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉండటం వల్ల ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్నారు. ఇకపోతే తాజాగా తేజ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ రాజమౌళి సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అహింస సినిమాకు జయం సినిమాకు పోలికలు ఉన్నాయి అంటూ యాంకర్ ప్రశ్నించగా తన సినిమాలన్నింటికీ తానే దర్శకత్వం వహించి తానే సినిమాలు చేస్తాను కనుక ప్రతి ఒక్క సినిమాలోని కొన్ని సిమిలారిటీస్ తప్పకుండ కనపడతాయని తేజ తెలియజేశారు. కేవలం నేను చేసే సినిమాలు మాత్రమే కాకుండా ఇతర డైరెక్టర్లు చేసే సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయని తెలియజేశారు.
రాజమౌళి సినిమాల విషయానికి వస్తే రాజమౌళి మొదటి నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలన్నీ కూడా ఓకే తరహా లోనే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ల గురించి దర్శకుడు తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…