Director Teja: రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

0
26

Director Teja: డైరెక్టర్ తేజ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈయన ఎప్పుడు తనకు తోచిన విషయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉండటం వల్ల ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్నారు. ఇకపోతే తాజాగా తేజ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ రాజమౌళి సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అహింస సినిమాకు జయం సినిమాకు పోలికలు ఉన్నాయి అంటూ యాంకర్ ప్రశ్నించగా తన సినిమాలన్నింటికీ తానే దర్శకత్వం వహించి తానే సినిమాలు చేస్తాను కనుక ప్రతి ఒక్క సినిమాలోని కొన్ని సిమిలారిటీస్ తప్పకుండ కనపడతాయని తేజ తెలియజేశారు. కేవలం నేను చేసే సినిమాలు మాత్రమే కాకుండా ఇతర డైరెక్టర్లు చేసే సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయని తెలియజేశారు.

Director Teja: అందరి డైరెక్టర్ల సినిమాలు ఒకేలా ఉంటాయి…


రాజమౌళి సినిమాల విషయానికి వస్తే రాజమౌళి మొదటి నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలన్నీ కూడా ఓకే తరహా లోనే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ల గురించి దర్శకుడు తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.