Movie News

Trivikram Srinivas: ఆ విషయం పట్టుతప్పుతున్న త్రివిక్రమ్.. వాళ్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా?

Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలతో అభిమానులను వరుసగా డిసప్పాయింట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం సినిమాతో కూడా మరోసారి డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీను చూసిన ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ చాలా డిసప్పాయింట్ చేశాడని ఒక విషయంలో గురూజీ పట్టు తప్పుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడు అనే పేరు ఉంది.

కానీ గత రెండు మూడు సినిమాల నుంచి ఈ విషయంలో ఆయన కష్టపట్టుతప్పుతున్నాడు. అంతేకాకుండా సెకండ్ హీరోయిన్ లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నాడు అన్న సందేహాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో రాజీ అనే మర్దరి పాత్ర కోసం మీనాక్షి చౌదరి తీసుకున్న విషయం తెలిసిందే. అక్క ఈ సినిమాలో మీనాక్షి ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఫ్యాన్స్ ని ఫుల్ గా డిసప్పాయింట్ చేసిన గురూజీ..

ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా సెకండ్ హీరోయిన్ విషయంలో కూడా ఆయన దారుణంగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమా విషయంలోనే కాకుండా త్రివిక్రమ్ గత రెండు సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయింది. అరవింద సమేత మూవీలో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక అల వైకుంఠపురములో చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. మరి తదుపరి సినిమాల విషయంలో అయినా ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది అంటూ పలువురు అభిమానులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

12 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

40 minutes ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

42 minutes ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

1 hour ago