Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?
Trivikram -Pawan Kalyan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా, కెరియర్ పరంగా ఉన్న స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మొట్టమొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో వీరీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇండస్ట్రీలో వీరీ అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తోంది.
మాటల మాంత్రికుడుగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగానే తన మాటలతో పవన్ కళ్యాణ్ ను తన మాయలో వేసుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా అంటే తప్పనిసరిగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ఉండాల్సిందే. ఇలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస రీమేక్ చిత్రాలను చేస్తున్నారు.
ఈ రీమేక్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది.అయితే ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు.
ఇక ఈ సినిమా కోసం పని చేసినందుకుగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 20 కోట్ల రూపాయలను సంపాదించారు. సాధారణంగా ఒక డైరెక్టర్ సినిమా చేస్తే తీసుకునే పారితోషికాన్ని ఈయన స్క్రీన్ ప్లేకి మాత్రమే తీసుకున్నారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మాయలోపడి రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు అభిమానులు రీమేక్ చిత్రాలు వద్దు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నా ఈయన మాత్రం పూర్తి తెలుగు చిత్రాలను పక్కనపెట్టి వరుస రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఇక పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రానికి కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ 20 కోట్ల వరకు డిమాండ్ చేశారని సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ బంగారు గనిగా మారిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…