Featured

Director V.N. Adithya : చిరంజీవి ఇంట్లో పెళ్ళికి వెళితే ఎం జరిగిందంటే…: డైరెక్టర్ విఎన్ ఆదిత్య

Director V.N. Adithya : 2001లో వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా హిట్ కొట్టాడు విఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమా తరువాత మళ్ళీ ఉదయ్ కిరణ్ తోనే మరో సాయి ‘శ్రీరామ్’ అనే సినిమా చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఒకేసారి ఆదిత్య కు చిరంజీవి అలాగే నాగార్జున ఇద్దరి నుండి ఆఫర్ వచ్చింది. ఒకేసారి రెండు హ్యాండిల్ చేయడం కష్టమై చిరంజీవి సినిమా సరిగా రాకపోవడం వల్ల వదులుకున్నారు. ఇక నాగార్జున తో ‘నేనున్నాను’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ సినిమా సక్సెస్ తరువాత విఎన్ ఆదిత్య తీసిన మనసు మాట వినదు, బాస్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య గారు తన కెరీర్ గురించి మాట్లాడారు.

చిరంజీవి గారింట్లో ఫంక్షన్ కి వెళితే ఆయన అలా మాట్లాడారు…

రావి కొండలరావు గారితో మా నాన్నగారికి ఉన్న కొద్దిపాటి పరిచయంతో చెన్నై కి ఆయనను కలవడానికి వెళ్లిన నేను అక్కడ ఆయన ద్వారా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే రైటర్ రెండు పనులకు చేరాను. సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్ద దర్శకుల వద్ద పని నేర్చుకున్నాను అంటూ ఆదిత్య తెలిపారు. అలా తెలుగువాళ్ళ దగ్గర ఇటు తమిళ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల రెండు చోట్ల మంచి టెక్నిషియన్స్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు ఆదిత్య. ఇటు హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను అలాగే స్క్రిప్ట్ పనుల్లో అసిస్టెంట్ గాను పనిచేయడం వల్ల హీరోల వద్ద మంచి రిలేషన్ ఉండేదని, వాళ్ళతో సినిమాలను చేసినా చేయకపోయినా వాళ్లకు ఆదిత్య మంచి టెక్నిషియన్ అని మాత్రం తెలుసని అది చాలా బాగా అనిపిస్తుందని చెప్పారు.

ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ కి వెళితే అక్కడికి తమిళ డైరెక్టర్ పి వాసు గారు వచ్చారు. ఆయన నన్ను చూసి ఆయన సినిమాల్లో నేను అసిస్టెంట్ గా చేయడం వల్ల గుర్తు పట్టి గట్టిగ హగ్ చేసుకుని నువ్వు తెలుగులో ఇంత పెద్ద డైరెక్టర్ వి అయ్యావు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు. ఆ సంఘటన మర్చిపోలేను అంటూ ఆదిత్య ఆయన అనుభవాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago