నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇటీవల మంచిర్యాలకు చెందిన ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‌లో ఈపాటకు డ్యాన్స్ చేయడంతో ఈ పాటకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
అప్పటి నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్ ఇంకా ఇతర షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ దుమ్ము రేపుతోంది. తెలంగాణలో మొదలైన ఈ క్రేజ్ ఏపీలో కూడా కొనసాగుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.
య్యూట్యూబ్ లో ఈ పాటకు కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ పాటకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా స్టెప్పులేయడం మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా సీనియర్ హీరోయిన్, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సైతం ఈ పాటకు స్టెప్పులేసింది. అది కూడా నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే డ్యాన్స్ వేసి అలరించింది. ప్రస్తుతం దివ్య వాణి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈమె ‘పెళ్లిపుస్తకం’ సినిమాతో ఎంతో ఫేమ్ అయ్యారు. ఆమె పలు సీరియళ్లలో కూడా నటించారు. ప్రస్తుతం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ఏదో కార్యక్రమానికి హాజరైన అనంతరం దివ్య వాణి సన్నిహితుల నడుమ, రోడ్డుపైనే ఈ పాటకు స్టెప్పులేశారు. దీంతో అక్కడున్న కొందరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ గా మారింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…